»   » అప్పుడు నేను లేదా ప్రభాస్‌లలో ఒకరం చనిపోయే వాళ్లం.. రానా

అప్పుడు నేను లేదా ప్రభాస్‌లలో ఒకరం చనిపోయే వాళ్లం.. రానా

Written By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ ట్వీట్ చేసిన భల్లాళదేవ రానా దగ్గుబటా ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Baahubali2

బాహుబలి కోసం రానా పెంచిన కండలు, సిక్స్ ప్యాక్ బాడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తన పాత్ర తీరుతెన్నులు, చిత్రంలో పోరాట సన్నివేశాల గురించి రానా సవివరంగా తెలిపారు.

కఠోర శ్రమతో సిక్స్ ప్యాక్

కఠోర శ్రమతో సిక్స్ ప్యాక్

బాహుబలి2 చిత్రంలో అత్యంత కీలకమైన పోరాట సన్నివేశాల కోసం రేయింబవళ్లు శ్రమించాను. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి కఠోర శ్రమ చేశాను. చాలా కాంప్లికేటెడ్ దశను చూశాను. యుద్ధం సన్నివేశాల్లో బలంగా, ప్రభావవంతంగా నటించాలంటే ఆ మాత్రం కష్టపడకపోతే ఫలితం కనిపించదు. అందుకే సీరియస్‌గా దేహదారుడ్యం కోసం విపరీతంగా కష్టపడ్డాను. దానికి ఫలితం తెరమీద కనిపించింది. ట్రైలర్ చూస్తుంటే గొప్ప ఉపశమనం లభించింది.

అలా చేసి ఉంటే ఎవరో ఒకరు చనిపోయేవాళ్లం

అలా చేసి ఉంటే ఎవరో ఒకరు చనిపోయేవాళ్లం

పోరాట సన్నివేశాల్లో నటించేటప్పుడు గొప్ప అనుభూతిని కలిగించే విషయాలు ఎదురయ్యాయి. పోరాట సన్నివేశాల్లో సీరియస్‌గా నటించినట్టు కనిపించాం కానీ అలా చేయలేదు. క్షేత్రస్థాయిలో ఒకవేళ నిజంగా ఫైట్స్ అలా చేసి ఉంటే ఇద్దరిలో ఒకరు మాత్రమే బతికి ఉండేవాళ్లం. పోరాటాలు అంత భీకరంగా ఉంటాయి.

ట్రైలర్‌కు విశేష స్పందన

ట్రైలర్‌కు విశేష స్పందన

ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. రికార్డు స్థాయి హిట్స్‌తో యూట్యూబ్‌లో సంచలనం రేపింది. ట్రైలర్‌లో ప్రభాస్, రానా మధ్య ఫైట్స్ అద్భుతంగా కనిపించాయి అని రానా వెల్లడించారు.

ఏప్రిల్ 28న రిలీజ్

ఏప్రిల్ 28న రిలీజ్

బాహుబలి ది బిగినింగ్ విడుదలైన రెండేళ్ల తర్వాత బాహుబలి ది కన్‌క్లూజన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఏప్రిల్ 28న రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది. ఈ చిత్రంలో అనుష్క, ప్రభాస్, తమన్నా, సత్యరాజ్, నాజర్ తదితరులు నటించారు.

English summary
Recently, Karan Johar took to Twitter to unveil a new poster featuring Rana Daggubati from Baahubali: The Conclusion. Bhallala Deva's menacing look for the film created quite a stir on social media. "There was a lot of fun moments that we had, we never went into a real face off, because one of us would have been dead by now, if we really went into that space," confessed Rana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu