»   » సైకిల్‌థాన్‌ ప్రారంభించిన హీరో రానా

సైకిల్‌థాన్‌ ప్రారంభించిన హీరో రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హుద్రోగ సమస్యలపై అవగాహన కల్పించేందుకు నగరంలో సైకిల్‌థాన్‌ నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రి నుంచి తిరిగి కిమ్స్‌ ఆసుపత్రి వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ఈ సైకిల్‌ థాన్‌ జరిగింది. ఔత్సాహికులు, ఆసుపత్రి వైద్యులతో పాటు సినీ హీరోదగ్గుబాటి రానా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా పాల్గొన్నారు.

కిమ్స్‌ ఆసుపత్రి నుంచి నెక్లెస్‌రోడ్‌ మీదుగా ఐమాక్స్‌కు చేరి అక్కడి నుంచి తిరిగి సైకిల్‌థాన్‌ కిమ్స్‌కు చేరింది. శరీరంలో అత్యంత ముఖ్యమైన గుండెను రక్షించుకోవడానికి సైకిల్‌ తొక్కడం ఎంతో అవసరమని కిమ్స్‌ ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ బి.భాస్కరరావు అన్నారు. సైకిల్‌ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని... దీన్ని అందరూ పాటించాలని సినీ నటుడు రానా అన్నారు.

Rana Daggubati Participated In Cyclethon Rally

రానా త్వరలో ప్రారంభం అయ్యే బాహుబలి 2 షూటింగుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి-ది బిగినింగ్' భారీ విజయం సాధించడంతో పార్ట్-2 షూటింగుకు మరింత ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు రాజమౌళి అండ్ టీం. బాహుబలి చిత్రం తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా వసూళ్లు సాధించింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 14న ఫార్మల్ గా పూజా కార్యక్రమాలతో ‘బాహుబలి-2' షూటింగ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు పండితులు ముహూర్తం ఖరారు చేసారు. సెకండ్ పార్ట్ కోసం దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తారని తెలుస్తోంది. మొత్తం 170 నుండి 190 వర్కింగ్ డేస్ లలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసారు.

Rana Daggubati Participated In Cyclethon Rally

బాహుబలి సినిమాలో భల్లాలదేవుడుగా మెప్పించిన రానా దగ్గుబాటి తొలి అవార్డు అందుకోబోతున్నాడు. సౌతిండియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఏసియావిజన్ మూవీ అవార్డ్స్-2015 లకు రానా ఎంపికయ్యాడు. తెలుగు విభాగంలో పెర్ఫార్మెర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రానా దక్కించుకున్నారు. డిసెంబర్ 2న దుబాయ్ లో జరిగే వేడుకలో రానా ఈ అవార్డు అందుకోబోతున్నాడు. ఏసియావిజన్ మూవీ అవార్డ్స్ ఇది 10 ఎడిషన్. ఈ నేపథ్యంలో గ్రాండ్ గా అవార్డు కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Daggubati Rana Participates in Hyderabad Cyclothon Conducted by KIMS Hospitals for a Healthy Heart
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu