For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాని మూవీ కోసం నిర్మాతగా రానా.. వాళ్లకు సినిమా చూపిస్తాడట

  |

  కెరీర్ మంచి ఊపుమీదున్న దశలో 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి చిత్రాలతో వరుస పరాజయాలను చవి చూశాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమాల తర్వాత అతడు నటించిన చిత్రం 'జెర్సీ'. క్రికెట్ బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా నానిని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించింది. ఇందులో నాని నటనకు, పలికించిన హావభావాలకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా రీమేక్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.

  రీమేక్ చేస్తామంటూ..

  రీమేక్ చేస్తామంటూ..

  తెలుగులో ఘన విజయం సాధించిన ‘జెర్సీ'ని రీమేక్ చేస్తామంటూ ఇతర భాషలకు చెందిన చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ముందుకు వచ్చారు. క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో దీనిపై అన్ని ఇండస్ట్రీలు కన్నేశాయి. అలాగే, మనదేశంలో క్రికెట్‌కు ఎంతో మంది అభిమానులు ఉండడంతో ఈ సినిమా ఏ భాషలో తీసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో వారంతా చిత్ర యూనిట్‌తో సంప్రదింపులు సైతం జరిపారు.

  ఇద్దరు బడా ప్రొడ్యూసర్లు కలిసి హిందీలోకి..

  ఇద్దరు బడా ప్రొడ్యూసర్లు కలిసి హిందీలోకి..

  ‘జెర్సీ'ని హిందీలోకి తీసుకెళ్లేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ గౌతమ్ తిన్ననూరే తెరకెక్కించనున్నారని తెలిసింది. అలాగే, ఈ సినిమాకు వరుణ్ ధావన్, షాహీద్ కపూర్‌లలో ఒకరిని తీసుకోవాలని ఈ ఇద్దరు నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

  తమిళంలోకి రానా..

  తమిళంలోకి రానా..

  ఒకవైపు ‘జెర్సీ'ని హిందీలో రీమేక్ చేయడానికి ఇద్దరు బడా ప్రొడ్యూసర్ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇదే సినిమాను తమిళంలోనూ తీయాలని సురేష్ ప్రొడక్షన్స్ భావిస్తోందట. ఈ చిత్రం ద్వారా ప్రముఖ హీరో రానా దగ్గుబాటి నిర్మాతగా మారబోతున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో తమిళ నటుడు విష్ణు విశాల్‌.. నాని పాత్రను పోషిస్తారని సమాచారం. విష్ణు స్వతహాగా క్రికెట్ ప్లేయర్ కావడంతోనే రానా ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

  నాని ‘నిన్ను కోరి' కూడా...

  నాని ‘నిన్ను కోరి' కూడా...

  నాని కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘నిన్ను కోరి'ని కూడా తమిళంలో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తమిళ దర్శకుడు కన్నన్ తీసుకున్నారు. ఇందులో నాని పాత్రను అధర్వ పోషిస్తుండగా.. నివేదా థామస్‌లా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఆది పాత్ర చేయబోయే వారి కోసం ప్రస్తుతం చిత్ర బృందం అన్వేషిస్తోంది.

  జెర్సీ గురించి..

  జెర్సీ గురించి..

  అవసరమైన సమయంలో నానికి ‘జెర్సీ' ద్వారా హిట్ వచ్చింది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమైంది. అలాగే కలెక్షన్ల పరంగానూ ‘జెర్సీ' సూపర్ సక్సెస్ అయింది.

  English summary
  Tollywood Young hero Rana Daggubati become Producer For Natural Star Nani Super Hit Movie Jersey. This Movie Tamil Rights Taken By Rana. In Very Few Days This Movie Will Start.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X