»   » సీఎం సీటు నా ముడ్డికిందుండాలి: రానా దుమ్ము రేపేసాడు, కాజల్ చనిపోతుందా..?? ( ట్రైలర్ )

సీఎం సీటు నా ముడ్డికిందుండాలి: రానా దుమ్ము రేపేసాడు, కాజల్ చనిపోతుందా..?? ( ట్రైలర్ )

Posted By:
Subscribe to Filmibeat Telugu

రానా దగ్గుబాటి లేటెస్ట్ మూవీ 'నేనే రాజు నేనే మంత్రి'. తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే టీజర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమా పై అంచనాలు పెంచేసిన రానా ట్రైలర్ తో హంగామా చేయడానికి వచ్చేసాడు. రానా జోగేంద్ర అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా, అనూప్ సంగీతం అందిస్తున్నాడు.

చీమలే కదరా కష్టపడాలి

చీమలే కదరా కష్టపడాలి

ట్రైలర్ లోని సన్నివేశాలు, రానా చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాయి. ఇక చివరిలో పాముకి పుట్ట కావాలంటే చీమలే కదరా కష్టపడాలి అని రానా చెప్పిన డైలాగ్ అదరహో అని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా, వీలైనంత త్వరగా మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.


కాజల్ అగర్వాల్, కేథరిన్ థెస్రా

కాజల్ అగర్వాల్, కేథరిన్ థెస్రా

కాజల్ అగర్వాల్, కేథరిన్ థెస్రా కథానాయికలుగా నటిస్తున్న ఈ చితం పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందినట్టు తెలుస్తుండగా, ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. బాహుబలి తర్వాత మామూలు పాత్రల్లో కనిపించినా కూడా జనం దృష్టి లో రానా ఇంకా బల్లాల దేవుడు గానే ఉన్నాడు. ఇప్పుడొచ్చిన ట్రైలర్ ఈ మార్క్ ని తీసేసేలా ఉంది. ఒక కొత్త స్టైల్ లో కనిపిస్తున్న రానా స్టైల్ కీ, డైలాగ్ లకీ మంచి రెస్పాన్స్ వస్తోంది.


రానా మీదే బేస్ అయి నడవబోతుందా?

రానా మీదే బేస్ అయి నడవబోతుందా?

మొత్తంగా రానా మీదే బేస్ అయి నడవబోతుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ టెంపర్ సినిమా క్లైమాక్స్ పోలి ఉంటుందనే గతంలో వార్తలు వచ్చాయి.ఈ విధంగానే టిజర్ లో రానా కు ముసుకు వేసి ఊరితియడానికి తీసుకువెళ్తారు. అప్పుడు పోసాని కృష్ణ మురళి పుట్టినవాడు మరణించాక తప్పాదు,మరణించినవాడు పుట్టకా తప్పదు' ఆమెన్ అంటారు.


ట్రైలర్ లో కూడా వినిపించే డైలాగ్ లు

ట్రైలర్ లో కూడా వినిపించే డైలాగ్ లు

అయితే దీనికి రానా బదులుగా ‘నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా నువ్వు ఎప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా'నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ ఒక పవర్ ఫుల్ డైయలాగ్ తో టిజర్ ని ఎక్కడికో తీసుకువెళ్ళాడు రానా ఇకా ఆ డైయలాగ్ ఫాన్స్ ని ఎంతోగాను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ట్రైలర్ లో కూడా వినిపించే డైలాగ్ లు మరింత పవర్ ఫుల్ గా ఉన్నాయి.సీయెం సీటు నాముడ్డికిందుండాలిః

సీయెం సీటు నాముడ్డికిందుండాలిః

సామాన్య జీవితం గడిపే వ్యక్తి జీవితం లో ఒక పెద్ద కుదుపు రావటం, ప్రతిగా అతను ఒక వ్యవస్తనే ఎదిరించేటంతగా తిరగ బడటమూ అన్న పాయింట్ లో సినిమా నడుస్తుందన్నది అర్థమవుతోంది. అంతే కాదు "లెక్కేసి కొడితే అయిదేళ్ళలో సీయెం సీటు నాముడ్డికిందుండాలి" అంటూ చెప్పిన డైలాగ్ మరింత గట్టిగానే సినిమా ఉద్దేశమేమిటో చెప్పకనే చెబుతోంది. ట్రైలర్ని బట్టీ చూస్తే కాజల్ పాత్ర మధ్యలోనే చనిపోతుందీ అనిపిస్తోంది


పెద్ద బ్రేక్ ఇచ్చే లాగానే కనిపిస్తోంది

ఇక ఇప్పటి వ్యవస్థని విమర్శిస్తూ కూడా మామూలుగా ఉందిపోయే ఓటర్ల మీద కూడా సెటైర్లు గట్టిగానే పడేలా ఉన్నాయి. "పాములకు పుట్టలు కావాలంటే చీమలే కదరా కష్టపడాలీ" అన్న డైలాగ్ దగ్గర సినిమా మొత్తాన్ని చెప్పేసాడు తేజా. మొత్తానికి ఈ సినిమా అటు రానా కీ ఇటు ఎన్నో సంవత్సరాలుగా ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు తేజాకీ పెద్ద బ్రేక్ ఇచ్చే లాగానే కనిపిస్తోంది.English summary
The theatrical trailer release of Nene Raju Nena Mantri featuring Rana Daggubati and Kajal Aggarwal is out Now
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu