»   » గురు గా మారనున్న రానా... బాబాయ్ తో కలిసే రానున్న సీక్వెల్

గురు గా మారనున్న రానా... బాబాయ్ తో కలిసే రానున్న సీక్వెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వైవిధ్యమైన సినిమాలతో సోలో హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రానా.. తాజాగా బాబాయ్‌ను ఫాలో అయిపోవాలని ఫిక్స్ అయ్యాడట. 'బాహుబలి' సినిమా తరువాత బాక్సాఫీస్ వద్ద స్టడీగా రాణిస్తున్న రానా.. ఇకపై సోలో హీరోగా రాణించడంపైనే దృష్టిపెట్టాడు. ఇందులో భాగంగా మంచి కథలను కాచి వడబోస్తున్న రానా.. ఈ సారికి బాబాయ్‌ను ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు. 'గురు' సినిమా వెంకటేశ్‌కు మంచి సక్సెస్ అందించగా.. దానికి సీక్వెల్ చేసే పనిలో పడ్డాడు టాల్ హ్యాండ్సమ్.

దగ్గుబాటి రానా

దగ్గుబాటి రానా

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా ‘గురు' గా వచ్చి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తనదైన నటనతో వెంకీ మెస్మరైజ్ చేశాడని విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించడం విశేషంగా నిలిచింది. అయితే, ఈ ‘గురు' కథను డైరెక్టర్ సుధా కొంగర ముందుగా మరో దగ్గుబాటి రానాకు వినిపించిందని రీసెంట్ గా తెలియడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది.

సీక్వెల్‌కు స్టోరీ సిద్ధం

సీక్వెల్‌కు స్టోరీ సిద్ధం

ఇప్పుడు దానిని తలదన్నే మేటర్ ను సుధా కొంగర తెరపైకి తెచ్చిందని తెలియడం విశేషం. సుధ కొంగర.. సీక్వెల్‌కు అప్పుడే స్టోరీ సిద్ధం చేసుకోగా.. దాన్ని వెంకటేశ్‌కు, సురేశ్ బాబుకు వినిపించడం కూడా జరిగిందని తెలుస్తోంది. ఈ స్టోరీ లైన్ కూడా బాగా నచ్చడంతో.. ఇరువురూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట.

రానా లీడ్ రోల్

రానా లీడ్ రోల్

అయితే.. ఈ సినిమాలో వెంకీకి బదులుగా రానా లీడ్ రోల్ పోషించబోతున్నాడని తెలుస్తోంది. వెంకీ క్యారెక్టర్‌ను రానా క్యారెక్టర్‌తో లింక్ చేయడమే ఈ సినిమాలో హైలైట్ పాయింట్ కానుందట. వెంకీ, రానా కేరక్టర్లను లింక్ చేస్తూ ఈమె చెప్పిన పాయింట్ ఈ సీక్వెల్ కి హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది.

నేనే రాజు నేనే మంత్రి

నేనే రాజు నేనే మంత్రి

దీనికి ఇంకా సురేష్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ప్రస్తుతం స్టోరీ లైన్ తో పాటు స్క్రిప్ట్ పై కొంత వర్క్ చేసిన సుధ కొంగర ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రానా, బాహుబలి పార్ట్ 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

English summary
Following the success of Guru, the director is reportedly planning a sequel to the movie has already narrated the script to Venkatesh. The twist, however, is that the sequel will have Rana Daggubati in the lead role
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu