»   » "ఘాజీ" మరో కంచె అవుతుందా..?? : సిద్దమైన ఘాజీ, హైలెట్ గా నిలవనున్న అండర్ వాటర్ ఫైట్

"ఘాజీ" మరో కంచె అవుతుందా..?? : సిద్దమైన ఘాజీ, హైలెట్ గా నిలవనున్న అండర్ వాటర్ ఫైట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రానా కథానాయకుడిగా నటించిన 'ఘాజీ' చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ రెండు వెర్షన్స్ కి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నారు.

భారీ నిర్మాణ విలువలతో జనవరిలో ప్రారంభమైన ఈ సినిమా కథానుసారం నీటి లోపల ఒక ప్రధానమైన యుద్ధ ఘట్టం కూడా చిత్రీకరించారు. ఇప్పటికే సర్టిఫైడ్ డైవర్ అయిన రానా ఈ పీరియడ్ డ్రామా కోసం ప్రత్యేకించి "అండర్ వాటర్" పాఠాలేమీ నేర్చుకోలేదు కానీ, కొద్దిగా రిహార్సల్స్ చేశారు. కొద్ది రోజులు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు నీటిలోనే ఉండి, షూటింగ్ చేస్తూ బాగా శ్రమపడ్డారని చిత్ర యూనిట్ సమాచారం.

 రానా, ఘాజీ, తాప్సీ

ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కే సినిమా కావడంతో, సహజత్వం కోసం కొంతమంది పాకిస్తాన్ రంగస్థల నటులను కూడా తీసుకున్నారట.ఈ సినిమాలో రానా నేవీ ఆఫీసర్ గా నటించాడు. ఈ పాత్రలో సహజత్వాన్ని తీసుకురావడానికి ఆయన సీనియర్ నేవీ అధికారుల సలహాలను .. సూచనలను తీసుకుని ఈ పాత్రను పోషించడం విశేషం.

1971లో జరిగిన భారత - పాకిస్థాన్ యుద్ధంలో మనపై దాడికి వచ్చిన పాకిస్థాన్ జలాంతర్గామి "పి.ఎన్.ఎస్. ఘాజీ" ని విశాఖపట్నం సముద్రతీరంలో భారతీయ సైనికులు తెలివిగా ముంచి వేశారు. ఆ ఘట్టాన్ని నేపథ్యంగా తీసుకొని చేస్తున్న సినిమా "ఘాజీ". ఈ చిత్రంలో కోస్ట్ గార్డ్స్‌లో ఎస్-21 అనే నౌకాదళ అధికారి పాత్రను రానా పోషిస్తున్నారు. ''ఇది ఒక అద్భుతమైన వాస్తవ కథ

తాప్సీ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించింది.తాప్సీ నేవీకి సంబందించిన సమాచారాన్ని స్టడీ చేస్తోందట. అంతే కాదు సినిమాలో సహజంగా కనిపించడానికి ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. ఈ సినిమా సక్సెస్ పై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. తనకి మరిన్ని ఛాన్సులు వస్తాయని భావిస్తోంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి..

English summary
Rana Daggubati's New Movie "Ghazi" Dubbing completed, ready to release
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu