»   » బాహుబలి నీ స్నేహం అద్భుతం.. మహిష్మతికి దూరమవ్వడం బాధగా.. రానా ట్వీట్

బాహుబలి నీ స్నేహం అద్భుతం.. మహిష్మతికి దూరమవ్వడం బాధగా.. రానా ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rana Tweeted "Missing The Great Kingdom Of Mahishmati!!" చాలా బాధగా ఉంది..

బాహుబలి చిత్రం సినీ ప్రేక్షకులకే కాదు అందులో నటించిన నటులకు కూడా అద్భుతమైన అనుభూతిని, అనుభావాలను అందించింది. బాహుబలి2 రిలీజై దాదాపు ఆరు నెలలు కావోస్తున్నా ఆ చిత్రానికి సంబంధించిన మధురానుభూతులు రానాను వెంటాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. తాజాగా బాహుబలిలో నటించిన ప్రభాస్ గురించి ఆసక్తికరంగా రానా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 బాహుబలి ఓ అద్భుతం..

బాహుబలి ఓ అద్భుతం..

తన ట్వీట్‌లో రానా ఏమీ పేర్కొన్నారంటే.. బాహుబలి షూటింగ్‌లో సమయాన్ని అద్భుతంగా ఆస్వాదించాం. ఆ సినిమా షూటింగ్ మధురమైన అనుభూతి. మహిష్మతి సామ్రాజ్యాన్ని మిస్ అవుతున్నాం అని ట్వీట్ చేశారు. ట్వీట్‌తోపాటు మహిష్మతి సింహాసనంపై ప్రభాస్‌తో కలిసి కూర్చొని ఉన్న ఫోటోను రానా షేర్ చేశారు. బాహుబలి చిత్రంలో నటించడం మొదలుపెట్టిన తర్వాత రానా, ప్రభాస్ చాలా క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాహుబలితో ఉన్న స్నేహాన్ని, అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకొన్నారు.

 రానా ట్వీట్‌కు అనూహ్య స్పందన

రానా ట్వీట్‌కు అనూహ్య స్పందన

ట్విట్టర్‌లో రానా చేసిన ట్వీట్‌కు అనూహ్యమైన స్పందన వస్తున్నది. సుమారు 25 వేల మంది లైక్ చేయగా, దాదాపు 2500 మంది రీట్వీట్ చేశారు. దాదాపు 350 మంది కామెంట్ చేశారు. కాగా ఆదివారం టెలివిజన్‌‌లో తెలుగు, హిందీ, తమిళంలో ప్రసారమైన బాహుబలి2 చిత్రానికి మంచి స్పందన వచ్చినట్టు తెలుస్తున్నది.

బాహుబలికి ప్రేక్షకులు నీరాజనం

బాహుబలికి ప్రేక్షకులు నీరాజనం

గత ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి చిత్రం సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ సుమారు 1760 కోట్ల రూపాయలను వసూలు చేసింది. బాహుబలిలో రానా పోషించిన భల్లాళదేవ పాత్రకు, ప్రభాస్ పోషించిన అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అనే పాత్రలకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

 నవంబర్‌లో బాహుబలి విడుదల

నవంబర్‌లో బాహుబలి విడుదల

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఘనవిజయం సాధించిన బాహుబలి2 చిత్రం ప్రస్తుతం చైనాలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్నది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు చర్యలు తీసుకొంటున్నారు. ప్రభాస్, రానాతోపాటు అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు నటించారు.

English summary
Baahubali 2: The Conclusion had its grand television premiere in Hindi, Telugu and Tamil On Sunday. Interestingly, Rana Daggubati, who plays the eponymous character Bhallala Deva, took to Twitter to post a candid picture with Prabhas. Rana wrote, "What fun we had in between all the madness..every day of filming this epic was memorable!! Miss being in the great kingdom of Mahishmati!!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu