For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చేయీ చేయీ కలిపి ఫొటో పోస్ట్ చేసాడు.... ఈమే నా హీరోయిన్ అంటూ రానా

  |

  కొందరు నటులు మంచి కేరక్టర్ కోసం చూస్తారే తప్ప కేవలం హీరోగానే చేస్తాను అని ఫిక్స్ కారు. అలాంటి లిస్ట్ లో రానా కూడా ఉన్నాడు. అతను యాక్ట్ చేస్తున్న పాత్రలు చూసిన ఎవరైనా ఈ సంగతి ఒప్పుకొంటారు. హీరోగా వచ్చిన నటుడు మరో కేరక్టర్ చేసేందుకు ఇష్టపడడు. కానీ రానా అలాంటి పట్టింపులు పెట్టుకోలేదు. విలన్ గా కూడా చేశాడు. అంతేకాదు...ఒక్క తెలుగు సినిమాలకే లిమిట్ కాలేదు. తమిళం, బాలీవుడ్ పిక్చర్స్ కూడా చేస్తున్నాడు.

  హీరోగా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత విలన్‌, క్యారెక్టర్‌ రోల్స్‌ వైపు టర్నయ్యాడు దగ్గుబాటి రానా. ముందు ఇదేం నిర్ణయం అన్నవాళ్లంతా ఆ తర్వాత భేష్‌ అన్నారు. హిందీలో 'బేబీ'.. తెలుగులో 'బాహుబలి' లాంటి సినిమాలో రానా ఇమేజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు అతడికి హీరోగా కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. అతడితో సినిమాలు చేయడానికి ఇటు సౌత్‌ ఇండియా నుంచి.. అటు బాలీవుడ్‌ నుంచి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇలాంటి టైంలో హీరోగా ఓ ఆసక్తికర సినిమాకు ఓకే చెప్పాడు రానా. పుష్కర కాలం నుంచి హిట్టు కోసం తపిస్తున్న డైరెక్టర్‌ తేజతో అతను ఓ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే.

  ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌తో పాటు కేథరిన్‌ థ్రెసా కథానాయికలుగా నటిస్తారు. ఈ చిత్రానికి ఓ వెరైటీ టైటిల్‌ రిజిస్టర్‌ చేయించాడు తేజ. 'నేనే రాజు నేనే మంత్రి' అనేది ఈ సినిమాకు తేజ పెట్టుకున్న టైటిల్‌. 'నేనే రాజు నేనే మంత్రి' అనే టైటిల్‌ను రానా మూవీ కోసం డైరక్టర్‌ తేజ రిజిస్టర్‌ చేయించినట్లు టాక్‌ వినిపిస్తుంది. టైటిల్‌ వినడానికి మామూలుగానే ఉన్నా.., ఇందులో రానాతో తేజ ఏదో సాహసం చేయబోతున్నట్లే తెలుస్తుంది. దీన్ని బట్టే సినిమా ఎలా ఉండొచ్చు.. రానా పాత్ర ఎలా ఉండొచ్చు అన్నదానిపై ఓ అంచనాకు రావచ్చు.

  ఈ చిత్రాన్ని తేజనే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. తేజ ట్రాక్‌ రికార్డు చూసి రానా, కాజల్‌ ఈ సినిమాకు ఒప్పుకోవడం విశేషమే. కాజల్‌ అయినా.. తనను తేజ హీరోయిన్ని చేశాడన్న కృతఙ్ఞత తో ఓకే అని ఉండొచ్చు కానీ రానా ఒప్పుకోవడమే ఆశ్చర్యం. బహుశా స్క్రిప్టే అతణ్ని అంతగా ఎగ్జైట్‌ చేసి ఉండొచ్చు. ఈ సినిమా ఇప్పటికే మొదలైందా.. మొదలవబోతోందా అన్న క్లారిటీ లేదు. తేజ సినిమాలకు ప్రారంభోత్సవాలు.. అప్‌ డేట్స్‌ లాంటివేమీ ఉండవు. సైలెంటుగా సినిమా మొదలుపెడతాడు...

  రానా స‌ర‌స‌న న‌టిస్తున్న హీరోయిన్ కాజ‌ల్‌తో దిగిన ఫొటోను సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేశాడు రానా. ఈ ఫొటోలో గాజులతో ఉన్న ఒక అమ్మాయి చెయ్యి, బ్రేస్‌లెట్‌ ధరించి ఉన్న అబ్బాయి చెయ్యి కలిసి ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభమైందని తెలుపుతూ.. రానా, కాజల్‌ తమ ట్విట్టర్‌ ఖాతాల్లో ఒకే ఫొటోను ఇలా పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోకు రానా నా సూపర్‌ కో-స్టార్‌ను పరిచయం చేస్తున్నా అని ట్వీట్ చేసాడు.. వెంటనే కాజల్ ఆ ట్వీట్ కి స్పందిస్తూ బుద్ధిబలం, బాహుబలం కలిసి పనిచేయడం సూపర్‌ఫన్‌ కదా..' అంటూ రెప్లై ఇచ్చింది. మొత్తానికి ఈ ఇద్దరూ రాజమౌళి స్కూల్ లో అనుభవం ఉన్న ఆర్టిస్టులే. సో ఈ సారి తేజాకి ఒక విజయం దక్కినట్టే అనుకోవచ్చేమో..

  English summary
  we already knew that Bahubali star Rana daggubati and kajal team up for Movie with Teja, yester Day Rana has posted a pic of two hands and said "Introducing to you my superstar co-star!' MsKajalAggarwal to new beginnings" in his Twittwer account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X