»   »  మల్టీ స్టారర్ చిత్రంలో వెంకీ, రానా.. తమిళ రీమేక్‌లో బాబాయి, అబ్బాయి!

మల్టీ స్టారర్ చిత్రంలో వెంకీ, రానా.. తమిళ రీమేక్‌లో బాబాయి, అబ్బాయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యాన్స్‌కు శుభవార్త. బాబాయి వెంకటేష్, అబ్బాయి రానా దగ్గుబాటి ఒకే చిత్రంలో నటించనున్నారనే వార్త ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతున్నది. తమిళంలో విజయవంతమైన చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న సినిమాలో వెంకీ, రానాలు కనిపించనున్నారు. మల్టీ స్టారర్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో మరోసారి అగ్రహీరోలు ఒకే చిత్రంలో కనిపించడం శుభపరిణామని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

విక్రమ్ వేద చిత్రంలో రానా, వెంకీ

విక్రమ్ వేద చిత్రంలో రానా, వెంకీ

తమిళంలో విక్రమ్ వేద అనే చిత్రం సంచలన విజయం దిశగా వెళ్తున్నది. ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం బ్రహ్మండమైన వసూళ్లను సాధిస్తున్నది. వీరిద్దరి నటనకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ సినిమాలో వెంకటేశ్, రానా నటించనున్నారనేది తాజా సమాచారం.

No 1 Yaari With Rana : Akkineni Akhil Revealed Shocking Situation in His Life
విక్రమ్ వేదకు వారే ఫర్‌ఫెక్ట్

విక్రమ్ వేదకు వారే ఫర్‌ఫెక్ట్

ఈ చిత్రం కోసం రానా దగ్గుబాటి, వెంకటేశ్‌ను సంప్రదించాం. వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. తమిళంలో ఆర్ మాధవన్ పోషించిన పాత్రను వెంకటేశ్, విజయ్ సేతుపతి నటించిన పాత్రకు రానాను అడుగుతున్నాం. విక్రమ్ వేద చూసిన తర్వాత మా మొదటి చాయిస్ వారేనని భావించాం అని ఓ చిత్ర యూనిట్ పేర్కొన్నది.

చర్చలు జరుగుతున్నాయి..

చర్చలు జరుగుతున్నాయి..

ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయి. దేనిపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో నెలరోజుల్లో ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను మీడియాకు అధికారికంగా వెల్లడిస్తాం అని ఓ చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

విక్రమ్ భేతాల కథలు ఆధారంగా..

విక్రమ్ భేతాల కథలు ఆధారంగా..

విక్రమ్ వేద అనే చిత్రానికి పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించింది. విక్రమ్ భేతాళ కథల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విక్రమ్‌గా ఆర్ మాధవన్ నిజాయితీ ఆఫీసర్‌గా నటించారు. బేతాళుడి పాత్రలో విజయ్ సేతుపతి గ్యాంగస్టర్‌గా నటించారు.

విక్రమ్ వేద నిర్మాత స్పందన..

విక్రమ్ వేద నిర్మాత స్పందన..

తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలపై విక్రమ్ వేద చిత్ర నిర్మాత శశికాంత్ స్పందించారు. ఈ చిత్ర రీమేక్‌పై స్పందించడం తొందరపాటే అవుతుంది. చర్చలు జరుతున్నాయి. ఇంకా ఏది ఖారారు కాలేదు అని ఆయన చెప్పారు.

English summary
R Madhavan and Vijay Sethupathi's hit Tamil thriller Vikram Vedha is all set to be remade in Telugu. Vikram Vedha has opened to thunderous applause from critics and fans alike, and is currently running to packed houses. Rana Daggubati and Venkatesh might step into R Madhavan and Vijay Sethupathi's roles. Vikram Vedha producer Sashikanth told media that talks are in process. But nothing has been confirmed yet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu