Just In
- 1 hr ago
మరో సినిమా కోసం అడ్వాన్స్ అందుకున్న వైష్ణవ్ తేజ్..?
- 1 hr ago
ఓడినప్పుడు నన్ను చూసి నవ్వారు.. ఊపిరాడనివ్వకుండా చేశారు: సింగర్ సునీత
- 2 hrs ago
నమ్మిన వాళ్లే మోసం చేశారు.. ఒక్క ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు: రాజేంద్ర ప్రసాద్
- 3 hrs ago
RRR కంటే భారీ బడ్జెట్: ప్రభాస్‌తో స్టార్ డైరెక్టర్ వేసిన ప్లాన్ మామూలుగా లేదు!
Don't Miss!
- News
ప్రయాణికులకు గుడ్‌న్యూస్: వన్ రైల్..వన్ హెల్ప్‌లైన్: విచారణ, ఫిర్యాదులకు సింగిల్ నంబర్
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2021 కవాసకి నింజా 300; త్వరలో డెలివరీలు!
- Finance
సౌదీపై డ్రోన్ దాడి, డిమాండ్ ఎఫెక్ట్: చమురు ధరలు 100 డాలర్లకు చేరుకునే ఛాన్స్
- Sports
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక మారింది.. ఎక్కడంటే..?
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సమంతను ముంబై తీసుకెళ్తున్న రానా.. వాళ్లకు సినిమా చూపిస్తాడట.!
రానా దగ్గుబాటి.. లెజెండరీ ప్రొడ్యూసర్ డీ రామానాయుడు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనలోని అన్ని కోణాలను చూపిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'లో విలన్‌గానూ మెప్పించి ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. హీరోగా, విలన్‌గా ఫుల్ సక్సెస్ అయిన రానా.. నిర్మాతగానూ సక్సెస్ అవ్వాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే సరికొత్త కథలతో వచ్చే వారిని ప్రోత్సహిస్తున్నాడు. అంతేకాదు, అతడు బాలీవుడ్‌లో ఓ ప్రయత్నాన్ని మొదలు పెట్టబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం సమంతను ముంబై తీసుకెళ్తున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

జోష్ మీద ఉన్న సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత నటించిన చిత్రం ‘ఓ బేబి'. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత, సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అంచనాలు లేకుండా వచ్చినా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లోకి రీమేక్ చేసేందుకు ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు ముందుకు వస్తున్నారు.

బాలీవుడ్‌లోకి రీమేక్
తెలుగులో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాను బాలీవుడ్‌లోకి రీమేక్ చేయబోతున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన సురేష్ ప్రొడక్షన్స్ దీన్ని హిందీలోకి తీసుకెళ్లబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు కూడా చేస్తున్నారని టాక్ వినిపించింది. దీంతో ఇది అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

రంగంలోకి దిగిన రానా
సురేష్ ప్రొడక్షన్స్ ‘ఓ బేబి' హిందీ రీమేక్ హక్కులను తీసుకుందని వార్తలు వచ్చిన విషయం తెలిసింది. దీనికి కారణం ప్రముఖ నటుడు దగ్గుబాటి రానాకు బాలీవుడ్‌లో మంచి పరిచయాలు ఉండడమేననే టాక్ వినిపించింది. ఇప్పటికే ఈ రీమేక్ సంబంధించిన చర్చలు జరిపేందుకు రానా రంగంలోకి దిగాడని ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేసింది. ఇందుకోసమే అతడు ముంబైలో తరచూ పర్యటించేవాడని అన్నారు.

బాలీవుడ్ బ్యూటీతో రహస్య చర్చలు
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌తో దగ్గుబాటి రానా చర్చలు జరుపుతున్నాడని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. మొదట ఈ పాత్రకు కంగనాను నటింపజేయాలని సురేష్ ప్రొడక్షన్ వాళ్లు అనుకున్నా.. ఆమె పలు చిత్రాలతో బిజీగా ఉండడంతో పాటు ఓ వివాదంలో చిక్కుకోవడంతో ఆలియాను సంప్రదించారని అనుకున్నారు. ఈ విషయంలో ఆలియా నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది అన్న విషయం మాత్రం తెలియరాలేదు.

సమంతతో కలిసి ముంబైకి
తాజాగా ఈ రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం సమంత ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ కోసం ముంబై వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం రానాతో కలిసి ఆమె అక్కడకు వెళ్లబోతుందట. అయితే, రానా వెళ్లేది మాత్రం ‘ఓ బేబీ' రీమేక్ కోసం అని తెలుస్తోంది. సమంత నటించిన సినిమా కావడంతో ఆమెతో కలిసి కరణ్ జోహార్‌తో పాటు పలువురు సెలెబ్రిటీలకు ఈ సినిమాను చూపించబోతున్నాడట దగ్గుబాటి వారి అబ్బాయి.

‘ఓ బేబీ' గురించి..
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని నటించిన చిత్రం ‘ఓ బేబీ'. లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్‌లు తెరకెక్కించారు. ‘మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రానికి ఇది రీమేక్.