»   » రానా-రవిబాబు....ప్లాపు పడుతుందని హెచ్చరిక!

రానా-రవిబాబు....ప్లాపు పడుతుందని హెచ్చరిక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దగ్గుబాటి యువ హీరో రానా ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఒక్క హిట్టూ తన ఖాతాలో వేసుకోలేక పోయాడు. ఎన్ని సినిమాలు చేసినా తాను ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి', గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి' చిత్రాల్లో నటిస్తున్న రానా.... తాజాగా మరో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నటుడు, దర్శకుడు అయిన రవిబాబు తెరకెక్కించబోయే సినిమాకు రానా కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కమర్షియల్ చిత్రాల పోకడలో కాకుండా ప్రయోగాత్మకంగా సరికొత్త స్క్రిప్టుతో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రాన్ని రానా సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

Rana green signal to Ravi Babu

అయితే....రవిబాబు దర్శకత్వంలో రానా చేయడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రయోగాత్మక చిత్రాలతో రవిబాబు మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ....రానా ఇమేజ్‌కు తగిన దర్శకుడు అతడు కాదని అంటున్నారు. ఇప్పటికే వరుస ప్లాపుల ఉన్న రానా అనవసరంగా రిస్క్ చేస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరో వైపు రవిబాబు, రానా కాంబినేషన్ చిత్రంపై కొందరు పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. మన దగ్గర రొటీన్ కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులు విసుగెత్తి పోయారని, బాలీవుడ్ తరహాలో తక్కువ బడ్జెట్‌తో ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించడం మంచి పరిణామమని, మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా....ఎంటర్టెన్మెంట్ మిస్సవ్వకుండా సినిమా తీస్తే బాగుంటుందని అంటున్నారు.

English summary
Director Ravi Babu is gearing up for his next and the news here is that he is going to direct a movie with Dagguabati Rana in the lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu