»   » పవన్ దర్శకుడు చిత్రంలో అతిథి పాత్రకు రానా

పవన్ దర్శకుడు చిత్రంలో అతిథి పాత్రకు రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : దగ్గుపాటి రానా..స్ట్రైయిట్ హీరో గా కన్నా ఎక్కువగా...గెస్ట్ పాత్రలపై ఎక్కువ దృష్టి పెట్టనట్లున్నాడు. తాజాగా ఓ తమిళ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. పవన్ కళ్యాణ్ తో పంజా డైరక్ట్ చేసిన విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రానా చేస్తున్న పాత్ర హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు.


అజిత్‌ చిత్రంలో రానా తళుక్కున మెరిసేందుకు సిద్ధమయ్యాడు. అజిత్‌ ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. అజిత్‌ సరసన మరోసారి నయనతార కనువిందు చేయనుండగా, ఆర్య-తాప్సీ మరో జంటగా కనిపించనున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో పేరును అధికారికంగా ప్రకటించకపోయినా 'వలై' పరిశీలనలో ఉంది.

'బిల్లా' తర్వాత విష్ణువర్ధన్‌, అజిత్‌, నయనతార కలయికలో వస్తున్న సినిమా కావటంతో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మరో ఆకర్షణ వచ్చి చేరింది. టాలీవుడ్‌ యువ కథానాయకుడు రానా అతిథిపాత్రలో కనిపించేందుకు సమ్మతించాడట. యువనటుల మధ్య ఆరోగ్యకర వాతావరణం మొదలై మల్టీస్టారర్లకు సై అంటున్న నేపథ్యంలో అతిథిపాత్రల్లో నటించేందుకు కూడా వెనకాడటం లేదంటూ అక్కడ మీడియా పొగిడేస్తోంది.

ద్ధార్థ్‌, హన్సిక జంటగా నటించిన చిత్రం 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'. సుందర్‌.సి. దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సమంత, రానా అతిథి పాత్రల్లో తళుక్కున మెరిస్తునట్లు ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇప్పటికే వీరిపై సన్నివేశాలను తెరకెక్కించారు. త్వరలో పాటల్నీ, వచ్చే నెలలో చిత్రాన్నీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


సిద్దార్థ్, హన్సిక జంటగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సమ్‌థింగ్ సమ్‌థింగ్'. అనువాదచిత్రాల నిర్మాతగా పేరు గాంచిన శ్రీలక్ష్మీగణపతి పిక్చర్స్ సంస్థ అధినేత బి.సుబ్రహ్మణ్యం తొలి ప్రయత్నంగా ఎన్.సురేష్‌తో కలిసి నిర్మిస్తున్న స్ట్రయిట్ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లోఈ చిత్రం తెరకెక్కుతోంది.

English summary

 Rana Daggubati shifts his focus on Tamil films. With Ongaram (Krishnam Vanthe Jagath Gurum in Telugu), he also has Ajith's and Selvaragavan's flicks in his kitty. The actor has recently canned few scenes for Ajith's flim directed by Vishnuvardhan. He is playing a special appearance in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu