»   » పౌరాణిక చిత్రాలు చేయాలని ఉబలాట పడుతున్న ‘లీడర్’

పౌరాణిక చిత్రాలు చేయాలని ఉబలాట పడుతున్న ‘లీడర్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏవీయమ్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రామానాయుడు మనవడిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'లీడర్". ఈ చిత్రం మంచి సక్సెస్ తో నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో రాణా వారి విజయానందాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది! అని కొంచెం టెన్షన్ ఉండేది. ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నిజాయితీ, కొత్తదనంతో చిత్రాలు వస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరొక్కసారి నిరూపించారు అని అన్నారు.

ప్రస్తుతం ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే కథ విన్న టైం గుర్తుకు వచ్చింది. ఎందుకంటే దర్శకుడు శేఖర్ కమ్ముల మళ్ళీ ఆనంద్, గోదావరి లాంటి ప్రేమకథ చెబుతారో అనుకున్నాను కానీ అతను లీడర్ కథ చెప్పగానే షాక్ అయ్యాను. అసలు కథలోనుండి తేరుకోవడానికి నాకు పది రోజులు పట్టింది. ఈ చిత్రంలో ఆ క్యారెక్టర్ లో అలా కనిపించడానికి యువ రాజకీయ నేతల ప్రసంగాలను, వారి బాడీ లాంగ్వేజ్ ను గమనించే వాడిని. అదే ఈ చిత్రానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇక ముందు కూడా మంచి కథా చిత్రాలతో మీ ముందుకు వస్తాను తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను లీడర్ నాయకుడు రాణా తెలియజేశారు. మంచి పౌరాణిక చిత్రాలు చేయాలని కోరికగా ఉందన్న రాణా త్వరలో బాలీవుడ్ లో అభిషేక్ బచ్చన్ సరసన నటించనున్నాడు..భవిష్యత్ లో దర్శకత్వం పై మక్కువ ఉందంటూ తన మనసులోని మాటను తెలియపర్చాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu