»   »  ‘బాహుబలి' షూటింగ్ గురించి రానా..

‘బాహుబలి' షూటింగ్ గురించి రానా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి' లో దగ్గుబాటి రాణా నెగెటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. దీని గురించి రానా ట్వీట్ చేస్తూ... ఈ వీకెండ్ పూర్తిగా ఫిల్మ్ సిటీలోనే గడుపుతున్నా..సెట్ చాలా ఫన్ గా ఉంది. సిటీని మిస్సవుతున్న ఫీలింగ్ రావటం లేదు. అన్నారు.


ఈ చిత్రంలో రానా ... తండ్రిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అతని కొడుకుగా పవన్ కళ్యాణ్ పంజా చిత్రం విలన్ అడవి శేషు కనిపిస్తారు. ఇద్దరవీ నెగిటివ్ రోల్సే. అలాగే గారాబంతో చెడిపోయిన కొడుకు పాత్ర అడవి శేషుది అని తెలుస్తోంది. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.

అలాగే... తన చిత్రాలు గురించి వివరిస్తూ... భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతున్న బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు చేస్తున్నా.. ఈ రెండింటిలోనూ హీరోయిన్‌ అనుష్కే.. నాకన్నా సీనియర్‌ అని చెప్పుకొచ్చారు. ఇవి కాక అందాల రాక్షసి దర్శకుడు హను దర్శకత్వంలో హిందీ-తెలుగు చిత్రం, సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో తెలుగు-తమిళం ద్విభాషా చిత్రాలు చేస్తున్నా. ఇవి రెండూ మా సొంత సంస్థ సురేష్‌ ప్రొడక్షన్‌లోనివే. ఈ షూటింగ్‌లన్నీ దాదాపు ఒకే సమయంలో సాగుతాయ్‌.. తెలుగుతో పాటే మరో భాషలోనూ చిత్రం విడుదలయితే నాకు బోనస్‌.. అందుకే ఇలా చేస్తున్నా అని అన్నారు.

ఈ చిత్రంలో ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

English summary
Rana tweeted: Wrapped for the day. Spending the weekend working at Filmcity. The set is so much fun, don't even miss going back to the city :). Anushka will be seen as the female lead and SS Rajamouli is the Director of this mega budget movie. Sobhu Yarlagadda and Prasad Devineni are jointly producing the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu