»   » రౌద్రం అంటే ఇదీ.. భల్లాల దేవ స్టన్నింగ్ లుక్ (ఫొటోలు )

రౌద్రం అంటే ఇదీ.. భల్లాల దేవ స్టన్నింగ్ లుక్ (ఫొటోలు )

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , అనుష్క హీరోయిన్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కామీడియా పతాకంపై ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా బాహుబలి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ బల్గేరియా లో జరుగుతుంది. ఈ సినిమాలో భల్లాలదేవగా ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న దగ్గుబాటి రానా పుట్టినరోజు నేడు (డిసెంబర్ 14).

ఈ సందర్భంగా బాహుబలి సినిమాలో భల్లాల దేవా గెటప్ ని విడుదల చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'బాహుబలి'. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రానా పుట్టినరోజు సందర్భంగా బాహుబలిలో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.


సీనియర్ రానా దగ్గుబాటి:

సీనియర్ రానా దగ్గుబాటి:

ఎవ్వరూ ఊహించని రీతిలో ఇప్పుడు ''బాహుబలి 2'' సినిమా నుండి రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు రాజమౌళి. అదిగో వస్తున్నా అరివీరభయంకరుడు అంటూ మనోడు ఈ లుక్ ను రిలీజ్ చేయడం విశేషం. గతంలో బాహుబలి 1 పోస్టర్లలో రానా తాలూకు యంగ్ లుక్ ను చూపిస్తే.. ఈసారి బాహుబలి కొడుకు శివుడుతో తలబడే సీనియర్ రానా దగ్గుబాటిని పోస్టర్ పై ఆవిష్కరించారు. కండల్లో శూరత్వం.. చూపుల్లో క్రూరత్వం.. కోపోద్రిక్తుడైన భల్లాలదేవ.. కట్టప్ప అసలు బాహుబలిని ఎందుకు చెప్పాడో తెలిపే కథలో.. తన వంతు రచ్చ చేయడానికి రెడీ అయిపోతున్నాడు.


రానా మేకింగ్ వీడియో:

రానా మేకింగ్ వీడియో:

రానా ఈ చిత్రంలో భల్లాలదేవ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా బాహుబలి తొలి మేకింగ్ వీడియోను విడుదల చేసి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని మరొక మేకింగ్ వీడియో విడుదల చేసారు. తాజాగా రానా మేకింగ్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆ విగ్రహం తో, రానా ని చూస్తూంటే అతను ఆ బాడీని బిల్డప్ చేయటానికీ, భల్లాలదేవ గా ఆ పాత్రలో ఒదిగి పోవటానికి పడ్డ ప్రతీ క్షణం ఇక్కడ కనిపిస్తోంది.


భారతీయ సినీ చరిత్రలోనే:

భారతీయ సినీ చరిత్రలోనే:

ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


ఘాజీ కూడా వచ్చే ఏడాదికి:

ఘాజీ కూడా వచ్చే ఏడాదికి:

ప్రస్తుతం రానా నటిస్తున్న బాహుబలి 2 వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. రానా చేస్తున్న మరో మూవీ ఘాజీ కూడా వచ్చే ఏడాదికి ఫిబ్రవరి 17 కి ప్లాన్ చేశారు. ఘాజీ మూవీలో రానా నావెల్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. రానా బర్త్ డే కానుకగా చిత్రానికి సంబంధించి రానా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ లుక్ లో రానాని చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.


విజన్ ఉంది:

విజన్ ఉంది:

రానా కేవలం యాక్టర్ మాత్రమే కాదు ..నిర్మాత కూడా. బొమ్మలాట .. ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఓ సినిమా తీయగా దానికి అవార్డులు కూడా వచ్చాయి. రానాకు విజన్ ఉంది. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ కో ఆర్డినేటర్ గా కూడా చేస్తున్నాడు. మరి భళ్ళాలదేవుడికి మనం కూడా బర్త్ డే విషెస్ తెలియజేద్దాం.


ఈ పాత్రలో ఒదిగిపోవడానికి :

ఈ పాత్రలో ఒదిగిపోవడానికి :

బాహాుబ‌లి ది కన్‌క్లూజన్‌ కోసం బాగానే కష్ట పడ్డాడు.. దగ్గుబాటి రానా ఈ పాత్రలో ఒదిగిపోవడానికి తీవ్రమైన‌ కసరత్తులు చేస్తూ. కోచ్‌ కునాల్‌ గిర్‌ పర్యవేక్షణలో వర్కౌట్‌ షెడ్యూల్స్‌ను, అంతేకాకుండా అత‌ను చెప్పే డైట్ ను కూడా తప్పకుండా పాటిస్తూ. దీనికోసం 31ఏళ్ల రానా ప్ర‌తి రోజు రెండున్నరగంటలు కసరత్తులు చేస్తూనే కార్డియో, వెయిట్‌ ట్రెయినింగ్‌ల్లో వివిధ రకాలుగా శిక్షణ తీసుకున్నాడు.


92-93 కిలోలకు:

92-93 కిలోలకు:

బాహుబలి కంటే బాహుబలి: ది కన్‌క్లూజన్‌లో మరింత ఫిట్‌గా కనిపించనున్నాడురానా. ఒక సినిమాలో పాత్ర కోసం మొత్తం గ తన బాడీనే మార్చేసుకున్న రానా ఇప్పుడు ఆ రూపం తో ఆ పత్రకోసమే పుట్టాడా అన్నటూ కనిపిస్తున్నాడు. బాహుబలిలో రానా 108-110 కిలోల మధ్య బరువు ఉండేవాడు.. రెండో భాగంలో పాత్రకు అనుగుణంగా బరువు తగ్గాల్సి వచ్చింది. దీంతో కసరత్తులు చేసి 92-93 కిలోలకు చేరుకున్నాడు.


110 కిలోల బరువు :

110 కిలోల బరువు :

‘బాహుబలి' మొదటి బాగంలో రానా 110 కిలోల బరువు ఉండేవాడు. అయితే రెండో భాగంలో కొంచెం సన్నంగా, మరింత ఫిట్‌గా కనబడాల్సి ఉంది. అందుకే కఠినమైన వ్యాయామాలు, ప్రణాళికా బద్ధమైన డైటింగ్‌ చేసి 92 కిలోలకు తగ్గిపోయాడు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పోషకాహారాన్ని రెండుగంటలకొకసారి తీసుకునేవాడు. స్వీట్లను, ఆయిల్‌ ఫుడ్‌ను దూరం పెట్టాడు. మొత్తానికి ఇంత కష్టపడి రానా ఈ స్టేజ్‌కు వచ్చాడన్నమాట. ఈ ఫోటోను రానా తన ట్విట్టర్‌ ఎకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.


చెరిగిపోని ముద్ర‌:

చెరిగిపోని ముద్ర‌:

భ‌ల్లాల దేవుడిగా బాహుబ‌లి సినిమా ద్వారా టాలీవుడ్ లో చెరిగిపోని ముద్ర‌వేసిన రానా ఇప్పుడు ట్విట్ట‌ర్ లో త‌డాఖా చూపుతున్నాడు. సోషల్ మీడియాలో ఓ రికార్డును సాధించాడు. దక్షిణాది భాషలతోపాటు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న ఈ నటుడు ట్విట్టర్‌లో 20లక్షల ఫాలోవర్స్ తో సత్తాచాటాడు. ఈ జాబితాలో 24లక్షలతో మహేష్‌బాబు ముందు వరుసలో ఉన్నాడు. కాగా ప్రస్తుతం బాహుబలి-2, ఘాజీ చిత్రాలతో రానా బిజీగా ఉన్నాడు.ఆ విధంగా ఈ యంగ్ హీరో సూప‌ర్ స్టార్ కి చేరువ కావ‌డం ఫ్యాన్స్ ని సంతోష‌ప‌రుస్తోంది.


English summary
"Might Bhallaladeva is out to destroy" remarks director SS Rajamouli, giving a surprise treat to Ran on his 32nd birthday as the first look poster of Baahubali 2 featuring this villain is released. No doubt, while Rana's younger version made spine chilling impact on Baahuabali 1 posters, here his old aged look is just spelling terror and tremors.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu