»   » హాలీవుడ్ చిత్రం కమిటైన తెలుగు స్టార్ హీరో

హాలీవుడ్ చిత్రం కమిటైన తెలుగు స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు పరిశ్రమనే ఈదలేకుంటే ఇక హాలీవుడ్, బాలీవుడ్ సంగతి ఏమిటంటారా...అయితే ట్రైల్ వెయ్యటంలో తప్పేముంది అనుకున్నాడో ఏమో గాని దగ్గుపాటి రానా తాజాగా ఓ హాలీవుడ్ చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ మేరకు ట్రైల్ షూట్ కూడా జరిగింది. ఆదిత్య బట్టాచార్య అనే డైరక్ట్రర్ దీనిని డైరక్ట్ చేయనున్నాడు. ఆదిత్య బట్టాచార్య గతంలో అమీర్ ఖాన్ తో రాఖ్ అనే చిత్రం రూపొందించారు.

బసు బట్టాచార్య కుమారుడైన ఆదిత్య ఆ తర్వాత కొన్ని యుఎస్ ప్రాజెక్టులలో బిజీ అయ్యారు. ఆ తర్వాత సెన్సో యునీకో అనే ఇటాలియన్ చిత్రం రూపొందించారు. ఇక దమ్ మారో దమ్ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రానా ని చూసి ఎంపిక చేసుకన్నాడని, ట్రైల్ షూట్ కూడ రహస్యంగా హైదరాబాద్ లోనే జరిగిందని చెప్తున్నారు. ఇక రానా, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రెడీ అయిన నేనూ ..నా రాక్షసి చిత్రం త్వరలో రిలీజు కానుంది.

English summary
Rana is currently giving a trial shoot for a new film which could mark his debut in Hollywood. Sources say Rana has been roped in by Aditya Bhattacharya, son of the famous movie maker Basu Bhattacharya for this new movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu