»   » రాణా, సెల్వరాఘవన్ చిత్రం లాంచింగ్ డేట్..

రాణా, సెల్వరాఘవన్ చిత్రం లాంచింగ్ డేట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాణా, సెల్వరాఘవన్ కాంబినేషన్లో రూపొందే చిత్రం మే మొదట తేదీన లాంచ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రెడీ అయ్యే ఈ చిత్రాన్ని రామానాయుడు తమ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. జివి ప్రకాష్ సంగీతం అందించే ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ప్రస్తుతం రాణా దమ్ మారో దమ్ అనే హీందీ చిత్రంలో చేస్తున్నారు. రోహన్ సిప్పీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఇక రాణా..తొలి చిత్రం లీడర్ యాభై రోజులు దాటిన సందర్భంగా సమ్మర్ మార్కెట్ ని క్యాష్ చేసుకోవటానికి కొత్త పబ్లిసిటీ ప్రారంభించారు. అలాగే సెల్వరాఘవన్.. గతంలో రాణా బాబాయ్.. వెంకటేష్ తో ఆడువారి మాటలకు అర్దాలే వేరులే చిత్రం రూపొందించారు. త్రిష హీరోయిన్ గా చేసిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu