»   » దసారా రోజే ముహూర్తం....రానా, రెజీనా చిత్రం పూజ

దసారా రోజే ముహూర్తం....రానా, రెజీనా చిత్రం పూజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాహుబలి, రుద్రమదేవి వంటి రెండు పీరియడ్ డ్రామాలలో నటించి పేరు తెచ్చుకున్న రానా ఇప్పుడు సోషల్ చిత్రం ఒకటి ఒప్పుకున్నారు. బాహుబలి రెండో పార్ట్ షూటింగ్ మొదలయ్యే లోగా ఆయన ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొనాలని ఫిక్సయ్యారు. అందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ కొరియాగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. రానా తండ్రి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో రానా సరసన రెజీనాను ఎంపిక చేసారు. బాహుబలి 2 మొదలు కావటానికి మూడు నెలలు సమయం ఉంది. ఈలోగా ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ చేయాలని భావిస్తున్నారు.

Rana, Regina film’s pooja on Dussera

కొన్నాళ్లుగా దర్శకుడయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు ప్రేమ్ రక్షిత్. ఈ క్రమంలో ఇటీవల దగ్గుబాటి రానాను కలసి ఓ కథ వినిపించాడు. రానాకు ఆ కథ నచ్చడంతో.. ఈ సినిమా దాదాపు ఖరారైంది. పైగా.. ఈ సినిమాను రానా తండ్రి సురేశ్ బాబు నిర్మించనున్నారు. దర్శకుడిగా ఫస్ట్ మూవీనే పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ఛాన్స్ రావడంతో.. ఇక స్క్రిప్ట్ వర్క్ పై దృష్టిపెట్టాడట ప్రేమ్ రక్షిత్.

రీసెంట్ గా బాహుబలితో భారీ విజయాన్ని అందుకున్న రానా.. ప్రస్తుతం బెంగలూరు డేస్ రీమేక్ లో నటిస్తున్నాడు. త్వరలో బాహుబలి-2 షూటింగ్ లో పాల్గొననున్న ఈ టాల్ హీరో... ఆపై ప్రేమ్ రక్షిత్ సినిమాలోనటించనున్నాడట. మరి.. ప్రభుదేవా, లారెన్స్ తరహాలో... ప్రేమ్ రక్షిత్ కూడా దర్శకుడిగా సక్సెస్ అవుతాడేమో చూడాలి అంటున్నారు టాలీవుడ్ జనం.

English summary
Before shooting for second part of Baahubali, Rana will be starting a new film on the auspicious Dussera festival. This movie is to be directed by Prem Rakshit, the choreographer is turning director with this movie. Rana’s father Suresh Babu will be producing it.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu