»   » బాహుబలి-2లో తన పాత్ర గురించి చెప్పిన రానా

బాహుబలి-2లో తన పాత్ర గురించి చెప్పిన రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి-ది బిగినింగ్' సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్ల వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ‘బాహుబలి' పార్ట్ 2 కోసం ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

బాహుబలి పార్ట్ 1లో భళ్లాలదేవ పాత్రలో నటించిన రానా... పార్టులో తన పాత్ర ఎలా ఉండబోతోందనే విషయాలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘బాహుబలి-ది కంక్లూజన్'లో తాను పూర్తిగా నెగెటివ్ క్యారెక్టర్లో కనిపిస్తాను అని తెలిపారు. సెకండ్ పార్ట్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు.


Rana reveals his role in Baahubali 2!

సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే దాదాపు 40 శాతం పూర్తయింది. మిగిలిన షూటింగ్ అక్టోబర్ నుండి మొదలు పెట్టబోతున్నారు. 2016లో బాహుబలి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో అనుష్క(దేవసేన) పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుంది. బాహుబలి, దేవసేన మధ్య సాగే లవ్ ట్రాక్ ఆసక్తికరంగా ఉంటుంది.


ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు ముఖ్య పాత్రలు పోషించిన బాహుబలి చిత్రం ఈ రేంజిలో కలెక్షన్లు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫోర్బ్స్ కథనం ప్రకారం...ఇప్పటి వరకు కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే రూ. 500 కోట్ల మార్కును అందుకున్నాయి. హిందీయేతర సినిమాలు రూ 500 మార్కును అందుకున్న దాఖలాలు భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు లేనేలేదు. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3, పికె చిత్రాలు మాత్రమే రూ. 500 కోట్ల మార్కును అందుకున్నాయి.

English summary
Interacting with the media houses, Rana has revealed his role in Baahubali – The Conclusion. He said that he will be seen in a complete negative character in the second part also.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu