twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ తో పోటీ నుంచి తప్పుకున్న దగ్గుపాటి రానా

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' . ఈ చిత్రం నవంబర్ 9 న విడుదల తేదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే రోజున దగ్గుబాటి రానా,నయనతార కాంబినేషన్ లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌' విడుదల చేద్దామని ప్లాన్ చేసారు. అయితే రెండు సినిమాలకు క్లాష్ ఎందుకనుకున్నారో ఏమో గానీ, విడుదల తేదీ మార్చినట్లు సమాచారం. 'కృష్ణం వందే జగద్గురుమ్‌' చిత్రం అందిన సమాచారం ప్రకారం నవంబర్ 30న విడుదల చేయనున్నారు. ఈ విషయమై ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుతో పరిశ్రమలో కూడా సంతోషం వ్యక్తం అవుతోంది. రెండు పెద్ద సినిమాలూ ఒకే రోజు రిలీజవటం ధియోటర్స్ పరంగా ఇబ్బంది.

    'ఢమరుకం'కథ ఏమిటంటే...తెలుగు పురాణేతిహాసాల ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది. రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా అంధకాసురుడు అనే రాక్షసుడు ఒక్కడే మిగిలిపోతాడు. వెయ్యి సంవత్సరాలకొక్కసారి గ్రహాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి విశ్వంలో ఓ మహాద్భుతఘట్టం సాక్షాత్కరించే సమయంలో అంధకాసురుడు తిరిగి జన్మిస్తాడు. ఆ పవిత్ర ఘడియల్లో పుట్టడం వల్ల పంచభూతాలు అతని ఆధీనంలోకి వస్తాయి. అతన్ని శివుడి అంశతో జన్మించిన ఓ యువకుడు నిలువరించి లోకకల్యాణం ఎలా చేశాడు. గ్రహాలన్నీ ఒక్కటైనా ఆ పవిత్ర ముహూర్తంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది హీరో ఆశయం. ఎలా వివాహం చేసుకున్నాడు అనేది సినిమా కథ. ఈ చిత్రంలో అంధకాసురుడి పాత్రను రవిశంకర్ పోషించారు. మానవరూపంలో వున్న శివుడిగా ప్రకాష్‌రాజ్ కనిపిస్తారు.

    క్రిష్ తమ 'కృష్ణం వందే జగద్గురుమ్‌' చిత్రం విషయమై మీడియాతో మాట్లాడుతూ...''సమాజంలోంచి అల్లుకొన్న కథ ఇది. సమకాలీన అంశాలు తెరపైన కనిపిస్తాయి. వినోదం జోడించడం మర్చిపోలేదు. బీటెక్‌ బాబు, దేవిక పాత్రలు ప్రేక్షకులకు చేరువవుతాయి. '' అన్నారు. ఈ చిత్రం లాండ్ మాపియా నేఫధ్యంలో వాస్తవ సంఘటనలు ఇన్ కార్పోరేట్ చేస్తూ జరుగుతుంది.తమిళ నాడు,కర్ణాటక బోర్డర్ లో కథ జరుగుతుంది. ఈ సినిమాతో నేను ఓ కొత్త జనర్ ని ట్రై చేస్తున్నాను. ఈ చిత్రం ట్రావిల్ ఎడ్వెంచర్ ఫిల్మ్. ఇందులో రానా ధియోటర్ ఆర్టిస్టుగా,స్వార్ద పరుడుగా కనపిస్తే...నయనతార డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా స్వార్దం లేని వ్యక్తిత్వంతో కనిపిస్తుంది అన్నారు. ఈ చిత్రంలో రానా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందంటున్నారు దర్సకుడు క్రిష్. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...''మనిషి డబ్బుతో పాటు నడుస్తున్నాడో, డబ్బే మనిషిని నడిపిస్తుందో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం. మా బీటెక్‌ బాబు ఎలా నడిచాడన్నది సస్పెన్స్‌. నొప్పింపక, తానొవ్వక నెగ్గుకొస్తుంటాడు. కథకీ, కృష్ణ తత్వానికీ ఉన్న సంబంధం ఆసక్తికరం'' అన్నారు.

    English summary
    
 In what is turning out to be an incredible suspense drama, the release date of Rana Daggubati’s ‘Krishnam Vande Jagadgurum’ has been shifted back to November 30th. Just last night, the production team decided to get the film released on November 9th after discussions with distributors and financiers. However, things changed today morning and a final decision has been taken to get the film out on November 30th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X