For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆశ్చర్యం లో మునిగిపోతారు.... రానా "ఘాజీ" కథ ఇదే.., రిలీజ్ డేట్ వచ్చేసింది

|

విశాఖపట్నం సమీపంలోని సముద్రం లోపల జరిగిన యుద్ధం నేపథ్యంలో 'ఘాజీ' అనే సినిమా తెరక్కుతోన్న విషయం తెలిసిందే. రానా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, నాయకగా తాప్సీ నటిస్తోంది. 1971లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో సినిమా కొనసాగుతుంది. సబ్‌ మెరైన్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కిగా, ఇప్పటికే షూటింగ్‌ కూడా కంప్లీట్‌ అయినట్లు తెలుస్తుంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీతో విడుదల చేయబోతున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వారు తెలిపారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన సమావేశంలో సినిమా విశేషాలను చిత్ర బృందం వివరించింది. సముద్ర అంతర్భాగంలో తెరకెక్కించిన తొలి చిత్రంగా ఈ చిత్రాన్ని పేర్కొన్నారు. పీవీపీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంకల్ప దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.

చిత్రీకరణ అంతా నీటిలోనే:

ఇలాంటి సబ్జెక్ట్‌ని ఇంతవరకూ ఎవ్వరూ టచ్‌ చేయలేదు. ఇండియా, పాకిస్థాన్‌ యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ నేపధ్యంలో సినిమా ఇంతవరకూ రాలేదు. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ అంతా నీటిలోనే జరగాలి. అంతేకాదు సబ్‌మెరీన్‌తో షూటింగ్‌ అంటే చాలా కష్టంతో కూడుకున్నది.

సౌత్‌ సినీ చరిత్రలో:

అందులోనూ భారీ ఖర్చుతో కూడుకున్నది కూడా. అందుకే మన సౌత్‌ సినీ చరిత్రలో ఇంతవరకూ ఇలాంటి సాహసం ఎవ్వరూ చేయలేదు. కేవలం హాలీవుడ్‌ చిత్రాల్లోనే ఇలాంటి అద్భుతాలు చూస్తూంటాం. అయితే ఇప్పుడు రానా ఈ సంచలనానికి తెర లేపనున్నాడు.

తాప్సీ హీరోయిన్‌గా:

ఈ మధ్య రానా చేసిన భారీ బడ్జెట్‌ విజువల్‌ ఎఫెక్ట్‌ మూవీ అంటే 'బాహుబలి'. అయితే అంతకు మించిన అద్భుతంగా ఈ సినిమాని అభివర్ణిస్తున్నారు సినీ ప్రముఖులు. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌లో జోరుగా దూసుకెళ్లిపోతోంది. 'పింక్‌' సినిమాతో తాప్సీకి బడా ఇమేజ్‌ వచ్చేసింది బాలీవుడ్‌లో. మళ్లీ ఈ సినిమా కూడా తాప్సీకి ఆ రేంజ్‌ మూవీ కాగలదని భావిస్తున్నారు అంతా.

పిచ్చోడిలా చూశారట:

ఇండియన్‌ సినిమాలో ఇప్పటి వరకూ ఎవరు టచ్‌ చేయని కథ అనే ప్రచారంతో ముందుకొచ్చిన ఘాజీ సినిమాను దగ్గుబాటి రానా తీస్తున్నాడంటే స్నేహితులు, కొంతమంది నిర్మాతలు తనను పిచ్చోడిలా చూశారట. అయితే సినిమా చిత్రీకరణ మొదలు పెట్టి కాస్త వార్తల్లోకి వచ్చాకే కరణ్‌ జోహార్, టాన్‌డన్‌ మా సినిమాను హిందీలో రిలీజ్‌ చేయడానికి ముందుకొచ్చారని చెప్పాడు రాణా.

అర్ధరాత్రి 2 గంటల వరకు నీటిలోనే ఉండి:

భారీ నిర్మాణ విలువలతో 2016 జనవరిలో ప్రారంభమైన ఈ సినిమా కథానుసారం నీటి లోపల ఒక ప్రధానమైన యుద్ధ ఘట్టం కూడా చిత్రీకరించారు. ఇప్పటికే సర్టిఫైడ్ డైవర్ అయిన రానా ఈ పీరియడ్ డ్రామా కోసం ప్రత్యేకించి "అండర్ వాటర్" పాఠాలేమీ నేర్చుకోలేదు కానీ, కొద్దిగా రిహార్సల్స్ చేశారు. కొద్ది రోజులు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు నీటిలోనే ఉండి, షూటింగ్ చేస్తూ బాగా శ్రమపడ్డారని చిత్ర యూనిట్ సమాచారం.

పాకిస్తాన్ రంగస్థల నటులను:

ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కే సినిమా కావడంతో, సహజత్వం కోసం కొంతమంది పాకిస్తాన్ రంగస్థల నటులను కూడా తీసుకున్నారట.ఈ సినిమాలో రానా నేవీ ఆఫీసర్ గా నటించాడు. ఈ పాత్రలో సహజత్వాన్ని తీసుకురావడానికి ఆయన సీనియర్ నేవీ అధికారుల సలహాలను

పి.ఎన్.ఎస్. ఘాజీ:

సూచనలను తీసుకుని ఈ పాత్రను పోషించడం విశేషం. 1971లో జరిగిన భారత - పాకిస్థాన్ యుద్ధంలో మనపై దాడికి వచ్చిన పాకిస్థాన్ జలాంతర్గామి "పి.ఎన్.ఎస్. ఘాజీ" ని విశాఖపట్నం సముద్రతీరంలో భారతీయ సైనికులు తెలివిగా ముంచి వేశారు. ఆ ఘట్టాన్ని నేపథ్యంగా తీసుకొని చేస్తున్న సినిమా "ఘాజీ". ఈ చిత్రంలో కోస్ట్ గార్డ్స్‌లో ఎస్-21 అనే నౌకాదళ అధికారి పాత్రను రానా పోషిస్తున్నారు. ''ఇది ఒక అద్భుతమైన వాస్తవ కథ

యుద్ధ సంఘటన ఆధారంగా:

ట్రైలర్ విడుదల చేసే ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ' సినిమా కోసం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో సబ్‌మెరైన్‌ సెట్‌ వేశారని తెలిసి అందులో నటించడానికి దర్శకుడు సంకల్ప్‌ని కలిశాను. అది వైజాగ్‌లో జరిగిన యుద్ధ సంఘటన ఆధారంగా ఘాజీ కథతో రూపొందిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను.

15 వెర్షన్స్‌ రాసుకున్నాం. :

నాకు వైజాగ్‌తో 20ఏండ్ల అనుబంధం ఉంది. అక్కడ ఘాజీ సబ్‌మెరైన్‌ని చూస్తుంటాను. కానీ ఆ కథ గురించి ఎప్పుడు తెలుసుకోలేదు. ఇందులో నటించే అవకాశం రావడం అరుదైన విషయం. నేను, సంకల్ప్‌ కథపై ఆరేడు నెలల పాటు వర్క్‌ చేసి దాదాపు 15 వెర్షన్స్‌ రాసుకున్నాం.

'ఘాజీ' ఓ నాంది:

ఇది అరుదైన జోనర్‌ చిత్రం. ఈ చిత్ర నిర్మాణంలో భాగమైన అతుల్‌ కులకర్ణి, కె.కె.మీనన్‌, కరణ్‌జోహర్‌, టాన్‌డన్‌లకు కృతజ్ఞతలు. టీజర్‌ చూసి అమితాబ్‌ బచ్చన్‌ ఈ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి సినిమాలకు 'ఘాజీ' ఓ నాంది అవుతుంది' అన్న రానా మాటలు సినిమా పై మరింత ఆసక్తిని కలిగించే లా చేసాయ్.

English summary
The Ghazi Attack is an upcoming Indian war film directed by debutant Sankalp. Amitabh Bachchan lent his voice for the Hindi version of the film.The trailer was released on 11 January 2017. The film is scheduled to release on 17 February 2017
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more