»   » షాకింగ్: 'బెంగుళూరు డేస్' రీమేక్ లో రానా గెటప్ (ఆన్ లొకేషన్ స్టిల్)

షాకింగ్: 'బెంగుళూరు డేస్' రీమేక్ లో రానా గెటప్ (ఆన్ లొకేషన్ స్టిల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దగ్గుపాటి రానా...ప్రస్తుతం 'బెంగుళూరు డేస్' తమిళ రీమేక్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి ఆన్ లొకేషన్ స్టిల్ ఇది. ఇంతకుముందే బాహుబలి కోసం బాడీ పెంచిన రానా ...ఇదిగో ఇలా కనిపించి అందరినీ షాక్ కు గురి చేసాడు. అసలు ఎంతలో ఎంత ఛేంజ్ అంటున్నారు అంతాను.

మళయాళంలో విజయవంతమైన 'బెంగుళూరు డేస్' ని తెలుగు,తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాషల్లోనూ మొదట బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందించాలనే ప్లాన్ చేసారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం...తెలుగు వెర్షన్ కు వేణు శ్రీరామ్(ఓహ్ మై ప్రెండ్ ఫేమ్) ని, తమిళ వెర్షన్ కు గానూ బొమ్మరిల్లు భాస్కర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Rana's makeover in Bangalore Days!

అలాగే తెలుగు వెర్షన్ కు గాను శర్వానంద్, వరుణ్ తేజ, అవసరాల శ్రీనివాస్ ని ఖరారు చేసారు. ఎక్కడ నేటివిటిలకు తగినట్లు అక్కడ మారుస్తూ ఈ చిత్రం స్క్రిప్టు లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి తెలుగు లేదా తమిళ సినిమాలాగ ఆయా భాషల వారికి అనిపించేలా నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. అలాగే మళయాళ వెర్షన్ లో చేసిన నిత్యామీనన్ పాత్రకు గాను సమంత ని తీసుకునే అవకాసం కనిపిస్తోంది.

ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని వేరొక భాషలోకి అనువదించడమో లేక పునర్నర్మించడమో కొత్తేమీ కాదు. అయితే కొన్ని చిత్రాల రీమేక్‌ విషయంలో ప్రీప్రొడక్షన్‌ దశ నుంచే అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకలోకంలోనూ ఆసక్తి మొదలవుతుంటుంది. మలయాళంలో విజయవంతమైన 'బెంగళూరు డేస్‌' చిత్రం కూడా ఇప్పుడు వార్తలకు వేదికైంది. తెలుగు, తమిళ భాషల్లో బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు, పీవీపీ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మాతృకలో దుల్కార్‌ సల్మాన్‌, పహద్‌ఫాజిల్‌, నివిన్‌. నజ్రియా నజీమ్‌ తదితరులు నటించారు. అంజలి మీనన్‌దర్శకత్వం వహించారు. ఇందులో మూడు ప్రధాన పాత్రలుంటాయని వాటికి తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన యంగ్ హీరోలను తీసుకోవాలన్న తలంపుతోనే వీరి గురించి దర్శక, నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

మరో ప్రక్క ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించడానికి నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతుంది. మరి ఈ హిట్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకునే హీరో హీరోయిన్లు ఎవరన్నది మరి కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.

English summary
Have a look at the on location picture of 'Bangalore Days' Tamil remake. Is this the same guy who appeared as a hulk in period drama 'Baahubali'?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu