»   » ఖరారు : 'బాహుబలి 2' తర్వాత తొలి చిత్రం సీక్వెల్

ఖరారు : 'బాహుబలి 2' తర్వాత తొలి చిత్రం సీక్వెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్ ముందు తానేంటో నిరూపించుకున్న దగ్గుపాటి రానా తన తదుపరి చిత్రం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు తనను పరిచయం చేసిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అని తెలుస్తోంది. ఆ కథ కూడా లీడర్ చిత్రానికి సీక్వెల్ అని అంటున్నారు. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు రానా చేసిన ట్వీట్ చూడండి

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక బాహుబలి 2 విషయానికి వస్తే...

ఇక ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ విషయానికి వస్తే...దాదాపు అందరి లీడింగ్ ఆర్టిస్టుల కాల్ షీట్స్ పూర్తి అయిపోయాయని తెలుస్తోంది. ఇంకా VFX వర్క్, ఇరవై రోజుల బ్యాలెన్స్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

Rana's Next Is Shekar Kammula's Leader 2?

'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా.

టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మరో ప్రక్క సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అయిన ఫేస్ బుక్, ట్విటర్ లో 'బాహుబలి' హవా కొనసాగుతోంది. కెరీర్ లో ఇప్పటివరకు తీసిన తొమ్మిది చిత్రాలలో ఏ ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. దాంతో ఈ పదో సినిమా కూడా పాజిటివ్ టాక్ తో రన్ అవటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది.

English summary
Rana, a while ago, tweeted saying that Leader 2 is in the making. It is already learnt that Rana made his acting debut with Sekhar Kammula's political drama, Leader.
Please Wait while comments are loading...