»   » బాల దర్శకత్వంలో తెలుగు హీరో రానా...

బాల దర్శకత్వంలో తెలుగు హీరో రానా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుల్లో తమిళ దర్శకుడు బాల ఒకరు. ఆలత సినిమాలు రియలిస్టిగ్ గా ఉంటాయి కాబట్టే పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు రోటీన్ సినిమాలకు భిన్నంగా ఉండటమే కాదు, హీరోల లుక్ డిఫరెంటుగా... ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటమే అందుకు కారణం. సౌత్ లో స్టార్ హీరోలు సైతం ఆయనతో ఒక్కసారైనా చేయాలని ఆశ పడుతుంటారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాల దర్శకత్వంలో తెలుగు హీరో రానా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి ముందు వరకు రానా అంటే ఎవరూ పెద్ద ఆసక్తి చూపే వారు కాదు. కానీ బాహుబలి తర్వాత రానా బాగా పాపులర్ అయ్యారు. దీనికి తోడు తమిళంలో ఇటీవల రానా నటించిన ‘బెంగుళూరు నాట్కల్' చిత్రం మంచి విజయం సాధించింది. మళయాల హిట్ మూవీ ‘బెంగుళూరు డేస్'కు రీమేక్ ఇది.

Rana’s next with director Bala

ఈ సినిమాల హిట్ తో బాల కన్ను.....రానా మీద పడింది. ఇటీవలే రానాకు ఓ స్టోరీ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ విషయాన్ని రానా ఇటీవల ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. స్వాతంత్రానికి ముందు సంఘటనలతో ఈ సినిమా ఉంటుందని, వివాదాస్పద నవల...‘కుట్రా పరంబరై' ఆధారంగా ఉంటుందని అంటున్నారు. మరి రానాను .... బాల ఏ రేంజిలో చూపెట్టబోతున్నాడో చూడాలి.

బాలాతో పాటు అమీర్ అనే మరో దర్శకుడితోనూ రానా తమిళంలో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం రానా తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి-2' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సీక్వెల్ కూడా చేయబోతున్నారట. మొత్తానికి కాస్త ఆలస్యమైనా.... రానా కూడా సౌత్ లో స్టార్ హీరో గా ఎదుగుతున్నాడు.

Read more about: rana, bala, రానా, బాల
English summary
Rana has signed yet another multistarrer in Tamil under the direction of national award winning auteur Bala. The film apparently is based on the controversial novel Kuttra Parambarai, which is set in pre-independence era.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu