»   » రాణా సరసన బాలీవుడ్ సెక్స్ బాంబ్

రాణా సరసన బాలీవుడ్ సెక్స్ బాంబ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తొలి చిత్రం రిలీజ్ కాకముందే క్రేజు తెచ్చుకున్న యంగ్ హీరో రాణా సరసన బాలీవుడ్ సెక్స్ బాంబ్ బిపాసా బసు ని బుక్ చేసారని సమాచారం. అయితే ఆ చిత్రం తెలుగులో కాదు...రాణా హిందీలో చేస్తున్న'దమ్‌ మారో దమ్‌' కి ఈ ఎంపిక జరిగింది. అభిషేక్‌ బచ్చన్‌, రానా, ప్రతీక్‌ బబ్బర్‌ హీరోలుగా చేస్తున్న ఈ చిత్రాన్ని రోహన్‌ సిప్పీ దర్శకత్వం వహిస్తున్నారు.

గోవా నేపథ్యంగా డ్రగ్ రాకెట్ చుట్టూ సాగే కథ ఇది. మొదట ఈ పాత్రకు కంగనా రౌనత్ ని అనుకున్నారు అయితే బిబాసాని చివరి నిముషంలో ఎంపిక చేసారని తెలుస్తోంది. ఆదిత్య పంచోలి విలన్ గా చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన రానా తొలి చిత్రం 'లీడర్‌' ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu