»   » రానా థాయిలాండ్ లో అరణ్యవాసం..నెలరోజులు తిప్పలు తప్పవు!

రానా థాయిలాండ్ లో అరణ్యవాసం..నెలరోజులు తిప్పలు తప్పవు!

Subscribe to Filmibeat Telugu

రానా రోజు రోజుకు నటుడిగా రాటుదేలుతున్నాడు. బాహుబలి చిత్రంతో రాజా జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఘాజి, నేనే రాజు నేనే మంత్రి వంటి విభిన్న చిత్రాలని ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. రానా జాతీయ స్థాయిలో తన మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. రానా ప్రస్తుతం హాథీ మేరె సాథి అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడులై అందరిని ఆశ్చర్యపరిచింది. రానా పూర్తి విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడు.

Rana to spend one month in forest

కాగా చిత్ర యూనిట్ నెలరోజుల షెడ్యూల్ కోసం థాయిలాండ్ వెళ్ళింది. నెలరోజుల పాటు థాయిలాండ్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకోనుందని రానా తెలిపాడు. ఈ చిత్రానికి తెలుగులో అడవి రాముడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రానా ఈ చిత్రంలో బందెర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అడవిలో రానా గజరాజుగా ఏనుగుల మధ్య నటిస్తున్నాడు. నెలరోజుల పాటు రానాకు అడవి జీవితమే అన్నమాట.

English summary
Rana to spend one month in forest. Haathi Mere Saathi movie shoot in Thailand
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu