»   » లీడర్ కి ఇంకా ప్రచారం అవసరమా !?

లీడర్ కి ఇంకా ప్రచారం అవసరమా !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం సినిమాలను, సినిమా ధియేటర్లను తమ చేతులలో పెట్లుకున్న కొంతమంది నిర్మాతలు, వారి వారసులను పైకి తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నారంటే తొలి చిత్రంతోనే వారసుల్ని నెంబర్ వన్ చేయాలనే వారి తపన చూస్తుంటే సినిమా పరిశ్రమ ఏ దిశగా వెళ్తుందో అర్ధం కావడం లేదంటున్నారు సినీ పరిశ్రమ వర్గాలకు చెందిన కొందరు అనుభవజ్ఝులు.

ఈ విధంగా చూసుకుంటే నిర్మాత డి. రామానాయుడు మనుమడు రాణా హీరోగా తొలి చిత్రం 'లీడర్" కోసం వారు చేసిన ఆర్భాటాలు అంతా ఇంతా కాదు..మొదటి నుండి ఎంతో ఉత్కంఠ భరితంగా విడుదల అయిన ఈ చిత్రం కోసం ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారంటే ఏ టీవీ కార్యక్రమంలో చూసినా రాణా చిత్రం గురించే పబ్లిసిటి చేస్తున్నారు..అలాగే రాణా ఈ చిత్రం కోసం ఒకడుగు ముందుకు వేసి మరి సినిమాకు ప్రచారం చేసుకుంటున్నాడు.

ఏదైతేనేం ఈ చిత్రం నిజాం ఏరియాలో వారం రోజుల్లోనే 1.72 కోట్ల రూ. వసూళ్ళను రాబట్టింది. రాణా నటనతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వం డైలాగ్స్ సినిమాకి ఏ సెంటర్ల లో క్రేజ్ ని మరింత పెంచింది. అయితే ఇంకా సినిమాను మరింత విజయవంతం చేయాలని రాణా ముందుకు వచ్చి రోజూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నాడు. అది చూసిన కొందరు విమర్శకులు ఇంకా ప్రచారం అవసరమా అని విమర్శించడం మొదలెట్టారు. సో రాణా లీడర్ చిత్రం పై ఆశలు వదులుకుని తర్వాత చిత్రం పై శ్రద్ద పెడితే బాగుంటుందని అంటున్నారు విమర్శకులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu