»   » 'లీడర్‌' కథ విని షాకయ్యా రాణా

'లీడర్‌' కథ విని షాకయ్యా రాణా

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్‌ కూడా అందరిలాగే తన స్టయిల్‌లో ఏ ప్రేమకథో చెబుతాడని అంచనా వేశాను. కాని అతను కథ చెప్పగానే 'షాక్‌' అయ్యాను. కొన్ని రోజుల వరకు నన్ను 'లీడర్‌' కథలోని ఫీల్‌ వెంటాడింది. ఎన్ని కథలు విన్నా శేఖర్‌తోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను అంటున్నారు రాణా. ఆయన్ని హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో క్రితం వారం రిలీజైన 'లీడర్‌' డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసే భాగంగా రాణా మీడియాతో మాట్లాడుతూ...ఈ రోజు చిత్రానికి ఇంత మంచి క్రేజ్ రావటానికి, ప్రేక్షకుల నుంచి ఇంత మంచి స్పందన రావటానికి శేఖరే ప్రధాన కారణం అని చేప్పుకొచ్చారు.

అలాగే మొదట్లో ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇది కేవలం కొంత మంది ప్రేక్షకులకు మాత్రమే చేరువవుతుందని భయపడ్డాను. కాని చిత్రం విడుదల తర్వాత అన్ని వర్గాల వారు ఈ చిత్రాన్ని ఆదరించటం చూసి సంతోషంగా వున్నాను. ముఖ్యంగా బి,సి సెంటర్స్‌లో కూడా ప్రేక్షకులు కొన్ని కొన్ని సన్నివేశాలు పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌తో చూస్తున్నారు. నిజాయితీ, కలిగి కొత్తదనంతో చిత్రాలను తీస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని ఈ చిత్రం విజయం మరోసారి రుజువు చేసింది. శేఖర్‌ కమ్ముల నాకు 'లీడర్‌' కథ చెప్పక ముందు చాలా కథలు విన్నాను.అవి ప్రక్కన పెట్టి ఈ చిత్రం చేయమే కలిసివచ్చింది అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu