»   » మళ్ళీ తేజా మార్క్ టైటిల్... రానా సినిమా ఏమవుతుందో మరి

మళ్ళీ తేజా మార్క్ టైటిల్... రానా సినిమా ఏమవుతుందో మరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

రానా హీరో, విలన్, ఇలా ఒకే మార్క్ వేసుకోకుండా ఒక నటుడు అన్న మార్క్ తోనే నిలబడ్డ యాక్టర్ రానా దగ్గుబాటి అటు తమిళ్, బాలీవిడ్, ఇటు తెలుగు అన్ని ఇండస్ట్రీలలోనూ నచ్చిన, విలక్షణమైన పాత్రలౌ చేసుకుంటూ. ఒక డిఫరెంట్ వేలో సాగిపోతున్నాడు ఈ బల్లాల దేవుడు. రానా ఎంచుకునే పాత్రలు కూడా అతనికి తగ్గట్టుగానే ఉంటాయి. ఎక్కడా మూస ధోరని లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూంటాడు.

ఇప్పటివరకూ సోలో హీరోగా వచ్చిన సినిమాలూ ఒకటీ రెండే అయినా తనకంటూ ఒక ఫాలోయింగ్ ని ఏరొపరుచుకున్న రానా... ఇప్పుడు ఇంకోసారి సోలో హీరో గా రానున్నాడు. తేజ దర్శకత్వంలో రానా చేయనున్న సినిమాలో కాజల్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. 2006లో లక్ష్మీ కల్యాణం చిత్రంతో కాజల్‌ అగర్వాల్‌ను హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేసిందే తేజనే.

Rana and Teja's Movie Gets A Title

ఇప్పుడు దాదాపు దశాబ్ద కాలం తర్వాత తేజ దర్శకత్వంలో కాజల్‌ మరోసారి నటించనుంది. దీనికి సంబంధించి ఫోటో షూట్‌ కూడా చేశారు. రానా బాహుబలి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల తేజ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాలేదు. డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో తేజ తెరకెక్కించ‌నున్న ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క్యాథ‌రిన్ థెరిసాలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి ఓ వెరైటీ టైటిల్‌ రిజిస్టర్‌ చేయించాడు తేజ. 'నేనే రాజు నేనే మంత్రి' అనేది ఈ సినిమాకు తేజ పెట్టుకున్న టైటిల్‌. దీన్ని బట్టే సినిమా ఎలా ఉండొచ్చు.. రానా పాత్ర ఎలా ఉండొచ్చు అన్నదానిపై ఓ అంచనాకు రావచ్చు. ఈ చిత్రాన్ని తేజనే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. తేజ ట్రాక్‌ రికార్డు చూసి రానా, కాజల్‌ ఈ సినిమాకు ఒప్పుకోవడం విశేషమే. కాజల్‌ అయినా.. తనను తేజ హీరోయిన్ని చేశాడన్న కారనం తో ఓకే అని ఉండొచ్చు కానీ రానా ఒప్పుకోవడమే ఆశ్చర్యం. బహుశా స్క్రిప్టే అతణ్ని అంతగా ఎగ్జైట్‌ చేసి ఉండొచ్చు. ఈ సినిమా ఇప్పటికే మొదలైందా.. మొదలవబోతోందా అన్న క్లారిటీ లేదు. తేజ సినిమాలకు ప్రారంభోత్సవాలు.. అప్‌ డేట్స్‌ లాంటివేమీ ఉండవు. సినిమా పూర్తయ్యిందా లేదా అన్న సమాచారం చేరక ముందే థియేటర్లవరకూ వచ్చేస్తుంది.

English summary
Rana Daggubati has teamed up with director Teja for a movie, which is being produced by D.Suresh Babu under Suresh Productions banner, Sources claim that this film is titled 'Nene Raji Nene Mantri' and it is reportedly a political drama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu