»   » మాస్‌ సినిమా కోసం వెయిటింగ్...రాణా

మాస్‌ సినిమా కోసం వెయిటింగ్...రాణా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచి మాస్‌ సినిమాలో నటించాలని నాకూ ఉంది. అలాంటి కథ దొరికితే చేయడానికి సిద్ధం అంటున్నారు రాణా దగ్గుపాటి. హిందీ చిత్రం చేస్తూ హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు. అలాగే తన లీడర్ చిత్రం గురించి మాట్లాడుతూ.."నా మొదటి చిత్రమే ఇలా అన్ని వర్గాలవారినీ ఆకట్టుకోవడం సంతృప్తినిచ్చింది. సామాన్యులు, రాజకీయ నాయకులు, మేధావులు..అందరూ మా ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. శేఖర్‌ కమ్ముల ఒక దర్శకుడుగా ఈ సినిమాను తీయలేదు. బాధ్యత గల పౌరుడిగా కథను మలిచారు. అందుకే ఇంతటి ఆదరణ. సినిమాకు ముందు నేనేదైతే అనుకున్నానో దాన్ని చేరుకోగలిగాను. మా కుటుంబ సభ్యులు కూడా సినిమాను చూసి కొన్ని సలహాలు ఇచ్చారన్నారు.

అలాగే లీడర్‌ సినిమాలో రానాను ఎవరూ చూడలేదు. అందులో కనిపించింది కేవలం అర్జున్‌ ప్రసాద్‌ మాత్రమే. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ పాత్ర గురించే మాట్లాడటం సంతోషాన్నిచ్చిందన్నారు రానా. తను నటిస్తున్న హిందీ చిత్రం 'దమ్‌ మారో దమ్‌' గురించి మాట్లాడుతూ నాకు, నా నటనకు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమవుతుంది. ఇకపై నేను చేయబోయే సినిమాలన్నీ ఒకదానికొకటి పూర్తి వైవిధ్యంగా ఉంటాయి. 'దమ్‌ మారో దమ్‌' చిత్రంలో అభిషేక్ బచ్చన్ హీరోగా చేస్తున్నారు. బ్లఫ్ మాస్టర్ ఫేమ్ రోషన్ సిప్పీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu