»   » ఆ రెండు రీమేక్ ల్లో చేస్తాను....రాణా

ఆ రెండు రీమేక్ ల్లో చేస్తాను....రాణా

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల లీడర్ తో తెలుగు తెరకు పరిచయమైన రాణా తనకు తమ బ్యానర్ లో వచ్చిన 'ప్రేమ్‌నగర్‌', 'బొబ్బిలి రాజా' చిత్రాలను రీమేక్‌ చేస్తే వాటిలో నటించాలని ఉంది అంటూ కోరికను వెళ్ళబుచ్చారు. తాజాగా లీడర్ ప్రమోషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ... ''లీడర్‌ సినిమా ప్రజల్లోకి వెళ్ళినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలు ప్రజాదరణ పొందుతున్నప్పుడు మరిన్ని ప్రయోగాలను చేయాలనిపిస్తుంటుంది. 'లీడర్‌' చేస్తున్నప్పుడే నాకు రోహన్‌ సిప్పీ కథ వినిపించారు. అభిషేక్‌బచ్చన్‌, నేనూ చేస్తున్న ఆ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభమవుతుంది. ఆ సినిమా కోసం గిటార్‌ నేర్చుకుంటున్నాను. భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన కూడా ఉంద''ని అన్నారు. అలాగే తనతు వివేకానందుడిని చూస్తే స్ఫూర్తి కలుగుతుందని, పౌరాణిక పాత్రల్లో ఘటోత్కచుడు, దుర్యోధనుడు అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు. అలాగే పైరసీ సినీ పరిశ్రమకు శాపంలా తయరైందని...పైరసీ సీడీలలో చిత్రాలు చూడద్దని విజ్ఞప్తి చేసారు. ఇక లీడర్ డివైడ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. ఈ చిత్రం సెకెండాఫ్ లో పదిహేను నిముషాల సేపు కట్ చేసినట్లు తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu