»   » స్టార్ హీరో సినిమా... రష్యాలో రిలీజ్ కు భారీ ఏర్పాట్లు

స్టార్ హీరో సినిమా... రష్యాలో రిలీజ్ కు భారీ ఏర్పాట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu
YEH JAWAANI HAI DEEWANI
ముంబై : ఈ శుక్రవారం విడుదలైన 'యే జవానీ హై దివానీ' చిత్రం మంచి హిట్ టాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రణ్‌బీర్‌, దీపికా పదుకొణెలు ముఖ్యపాత్రలు పోషించారు. తన తాత వలే రష్యా దేశస్థుల అభిమానాన్ని సొంతం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడీ యువ నటుడు. యే జవానీ హై దివానీ చిత్రం జులై నాలుగున రష్యాలోని ప్రేక్షకులను అలరించనుంది.

సైఫ్‌ అలీ ఖాన్‌, దీపికా పదుకొణెలు నటీనటులుగా నటించిన 'కాక్‌టెయిల్‌' చిత్రం మన దేశంలోనే కాకుండా రష్యాలోనూ విజయాన్ని సొంతం చేసుకోవడంతో 'ఇరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ' రణ్‌బీర్‌ కపూర్‌ తాజా చిత్రాన్ని అక్కడ ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఇరోస్‌ ఇంటర్నేషనల్‌ వ్యాపార అభివృద్ధి విభాగం (ఇరోస్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌) అధ్యక్షుడు కుమార్‌ ఆహుజా మాట్లాడుతూ కాక్‌టెయిల్‌ చిత్రం రష్యాలో మంచి వసూళ్లు రాబట్టుకుందని, యే జవానీ హై దివానీ అలాగే కాసుల వర్షం కురిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో పాటు మన దేశంలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న మరో ఆరు చిత్రాలు రష్యాలో ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. వాటిలో 'జిందగీ నా మిలేగి దోబారా','రాక్‌స్టార్‌', 'దేశీ బోయిజ్‌', 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌', 'వికీ డోనర్‌', 'భూత్‌ రిటర్న్స్‌ త్రీడి' వంటివి ఉన్నాయి. కానీ యే జవానీ హై దివానీనే ముందుగా రష్యాలో విడుదలకానుందని, మిగతా చిత్రాల ప్రదర్శనల తేదీలను ఇంకా ఖరారు చేయలేదని ఆహుజా అన్నారు.

'ఏ జూతా హై జపానీ, ఏ పత్లూ ఇంగ్లీస్థానీ, సర్‌ పే లాల్‌ టోపీ రూసీ (రష్యా), ఫిర్‌ భీ దిల్‌ హై హిందూస్థానీ' అంటూ ప్రముఖ నటుడు రాజ్‌కపూర్‌ అన్ని దేశాల వారిని అలరించడానికి ప్రయత్నించినా మన దేశంతోపాటు రష్యాలోనే ఆయనకు ఎక్కువ మంది అభిమానులుండేవారు. కేవలం ఇంటి పేరే కాకుండా నటనను వారసత్వంగా తీసుకుని విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడు మనుమడు రణ్‌బీర్‌ కపూర్‌. ఇప్పుడు రణ్ బీర్ కపూర్ తన తాత వారసత్వాన్ని నిలబెడతానంటున్నారు.

English summary
It is a well-known fact that Kapoors have enjoyed long standing professional and personal relationship with the Russians. Now after Raj Kapoor and Rishi Kapoor, it is Ranbir Kapoor who would be taking the tradition forward. His upcoming film YEH JAWAANI HAI DEEWANI is all set to see a major release in Russia.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu