»   » ఎంతమాట..!?: అంతటి హీరోని పత్రికాముఖంగా ఫ్రాడ్ అనేసాడు

ఎంతమాట..!?: అంతటి హీరోని పత్రికాముఖంగా ఫ్రాడ్ అనేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో సంజయ్‌ దత్‌ జీవితకథ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దివంగత నర్గీస్‌గా మనీషా కోయిరాలా, సునిల్‌ దత్‌గా పరేష్‌ రావల్‌, మన్యతా దత్‌గా దియామీర్జా నటిస్తున్నారు. మరి సంజయ్ దత్ జీవితం అంటే అన్ని రకాల ట్విస్టులు ఉన్నాయి.

లవ్ అఫెయిర్లు, టెర్రరిస్ట్లులతో స్నేహాలు మరియు డ్రగ్ అడిక్షన్ .. ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి. సినిమాకి సూపర్ సరుకు. బాలీవుడ్‌లో అత్యంత వివాదాస్పద నటుడు సంజయ్‌దత్‌.. అక్రమ ఆయుధాల కేసులో కొంతకాలం జైలుజీవితం కూడా గడిపిన సంజూ భాయ్‌ జీవిత చరిత్ర ఇప్పుడు సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే.

Ranbir Kapoor just called Sanjay Dutt a fraud

యువహీరో రణ్‌బీర్‌ కపూర్‌ ఈ సినిమాలో మున్నాభాయ్‌ పోషిస్తున్నాడు. ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు రణ్‌బీర్‌. అయితే ఈ సినిమా గురించి ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంజయ్ దత్ ని ఒక ఫ్రాడ్ అనేసాడు. "సంజయ్‌ దత్‌ బయోపిక్‌ గురించి చెప్పాలంటే ఆయన తన జీవితం గురించి చాలా నిజాయితీగా వెల్లడించారు.

తన తప్పులను ఒప్పుకున్నారు. గాంధీలాంటి వ్యక్తి జీవితాన్ని మేం తెరకెక్కించడం లేదు. మేం ఒక ఫ్రాడ్‌మ్యాన్‌ (వంచకుడి) జీవితాన్నే తెరకెక్కిస్తున్నాం. ఆయన్ను చాలామంది ఇష్టపడితారు. చాలామంది ద్వేషిస్తారు. ఆయన చాలా వివాదాస్పదుడు. అయినా ఈ సినిమా కోసం తన జీవితం గురించి చాలా నిజాయితీగా చెప్పారు.

అది గొప్ప విషయం' అని రణ్‌బీర్‌ అన్నాడు. 'నేను ఆయన స్థానంలో ఉంటే ఇంత నిజాయితీగా నేను మంచివాడిని కాదని చెప్పి ఉండేవాణ్ని కాదేమో. ఆయన జీవితం నుంచి ప్రేక్షకులు ఎదైనా గ్రహిస్తే.. అది మంచి విషయమే అవుతుంది" అని అన్నాడు.

Ranbir Kapoor As Sanjay Dutt Going Viral | Filmibeat Telugu
English summary
Ranbir Kapoor is currently busy with the Sanjay Dutt biopic and he said that they were portraying a very fraud man on screen.
Please Wait while comments are loading...