»   » బట్టలిప్పేసి బుట్టలడ్డం పెట్టుకున్నారు: రొమాంటిక్ కంటే కొంచం ఎక్కువే (ఫొటోలు)

బట్టలిప్పేసి బుట్టలడ్డం పెట్టుకున్నారు: రొమాంటిక్ కంటే కొంచం ఎక్కువే (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్.. హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించిన జగ్గా జాసూస్ ఇప్పుడు బోలెడంత బజ్ క్రియేట్ చేసేస్తోంది. కొన్ని సార్లు సినిమాల్లో ఉండే నాలుగైదు పాటలే ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంటాయి. హాట్ సీన్లు, కామెడీతో ఉండే పాటల సంగతి వేరనుకోండి. పాటలు ఎంత ఆసక్తికరంగా ఉన్నా వాటి సంఖ్య ఎక్కువగా ఉంటే భరించడం కష్టమే. అయితే బాలీవుడ్లో రాబోతున్న 'జగ్గా జాసూస్' చిత్రంలో ఏకంగా 29 పాటలు ఉన్నాయట.

జూలై 14న థియేటర్లలోకి

జూలై 14న థియేటర్లలోకి

బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదలైన పోస్టర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు బాగా పెంచాయి. ఒకప్పుడు ప్రేమికులైన ఈ ఇద్దరూ... విడిపోయి ఇపుడు సినిమా కోసం కలిసి నటించడం కూడా సినిమాకు కలిసొచ్చే అంశమే.

2011లో ప్రేమించుకున్నారు

2011లో ప్రేమించుకున్నారు

హిందీలో రెండు సినిమాల్లో కలిసి నటించిన రణ్‌బీర్‌, కత్రినా 2011లో ప్రేమించుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఒకే అపార్ట్‌మెంట్‌లో సహజీవనం చేశారు. వారి ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఆ మధ్యలో విదేశాలకు వెకేషన్‌కు వెళ్లి మీడియాకు చిక్కారు. అయితే వారు విడిపోవడానికి రణబీర్ తల్లి కారణమని అప్పట్లో పుకారు.

ఝుమ్రితలయ్యా

ఝుమ్రితలయ్యా

ఈ చిత్రంలో ఝుమ్రితలయ్యా అనే ఓ పాటను వినూత్నంగా చిత్రీకరించారు. ఇందులో కత్రినా, రణ్‌బీర్‌ దుస్తులు మంటల్లో కాలిపోతాయి. దాంతో పాట మొత్తంలో ఇద్దరూ కేవలం బుట్టలు ధరించే ఉంటారు. ఈ విషయాన్ని రణ్‌బీర్‌, కత్రినాలు చిత్ర ప్రచార కార్యక్రమంలో వెల్లడించారు. ఉల్లు కా పట్ఠా.. గల్తీ సే మిస్టేక్ అంటూ సాగే రెండు పాటలు జనాలకి సూపర్బ్ గా ఎక్కేశాయి.

ఛార్ట్ బస్టర్స్ గా

ఛార్ట్ బస్టర్స్ గా

ఇప్పటికే ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయి కూడా ఇప్పుడు ఝుమ్రితలయ్యా అంటూ సాగే పాటను త్వరలో విడుదల చేయబోతున్నారు. జగ్గా జాసూస్ మూవీ మొత్తంలో ఈ పాట రణబీర్ కు ఫేవరెట్ అంటున్నారు. ఈ సాంగ్ కి సంబంధించిన ఓ స్టిల్ ఇప్పుడు ఇంటర్నెల్ లో హల్ చల్ చేస్తోంది. ఈ స్టిల్ లో రణబీర్ కపూర్.. కత్రినా కైఫ్.. ఇద్దరికీ ఒంటిమీద బట్టలు లేవు.

బుట్టలనే ఒంటికి అడ్డుగా

బుట్టలనే ఒంటికి అడ్డుగా

అలాగని మొత్తం విప్పేసి చూపించేస్తున్నారని కాదు. పెద్ద బుట్టలనే వీరు తమ ఒంటికి అడ్డుగా పెట్టుకున్నారు. అలా నడుస్తున్న టైంలో.. కత్రినా కాలి షూ లేస్ ఊడిపోతే దాన్ని కట్టుకోవటానికి ప్రయత్నిస్తోంది, ఇక రణ్ బీర్ ఆసక్తిగ చూస్తున్నాడు. సినిమా వివరాల్లోకి వెళితే ఇదో మ్యూజికల్ అడ్వంచర్ రొమాంటిక్ ఫిల్మ్.

యూటీవీ మోషన్ పిక్చర్స్

యూటీవీ మోషన్ పిక్చర్స్

హీరో రణబీర్ కపూర్, దర్శకుడు అనురాగ్ బసు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యారు. యూటీవీ మోషన్ పిక్చర్స్ అధినేత సిద్ధార్థరాయ్ కపూర్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక యంగ్ డిటెక్టివ్ మిస్సయిన తన తండ్రి వెతుక్కుంటూ వెళ్లి ఎలాంటి సాహసాలు చేసాడు అనే కాన్సెప్టుతో ఈ సినిమా సాగుతుంది.

English summary
Actor Ranbir Kapoor and Katrina Kaif sharing screen space in the Anurag Basu directed film Jagga Jasoos. Though the film has been under production for the longest while now, it will finally be hitting screens in July.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu