»   »  అందరూ చూస్తుండగా దర్శకుడి పెదాలను ముద్దాడిన హీరో!

అందరూ చూస్తుండగా దర్శకుడి పెదాలను ముద్దాడిన హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా ప్రమోషన్ల కోసం ఎంతకైనా తెగించే బాలీవుడ్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జగ్గా జాసూస్' ప్రెస్ మీట్లో జరిగిన సంఘటన చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు.

సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా మీడియాతో చిత్ర యూనిట్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హీరో రణబీర్ కపూర్.... ఉన్నట్టుండి దర్శకుడిపై ముద్దుల వర్షం కురిపించాడు. తన పెదాలతో అతడి పెదాలను ముద్దాడాడు.

షాకైన మీడియా

హీరో హీరోయిన్ ముద్దులాడుకుంటే పెద్ద న్యూస్ అయ్యేదో లేదో? తెలియదు కానీ..... ఇలా హీరో, దర్శకుడు మీడియా ముఖంగా ముద్దులాడుకోవడం హాట్ టాపిక్ అయింది.

ఐదేళ్ల క్రితం కూడా ఇలానే...

ఐదేళ్ల క్రితం కూడా రణబీర్ కపూర్ ఇలాంటి పనే చేశాడు. అప్పట్లో బర్ఫీ చిత్ర ప్రమోషన్లో ఇదే విధంగా అనురాగ్ బసును ముద్దాడిన సంగతి తెలిసిందే.

పబ్లిసిటీ స్టంట్

పబ్లిసిటీ స్టంట్

అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంటే అంటున్నారు బాలీవుడ్ నిపుణులు. ఏదో ఒక సంచలనం క్రియేట్ చేసి సినిమాను ప్రమోట్ చేసుకోవాలనే తపనలోనే ఇలాంటివి చేస్తుంటారని అంటున్నారు.

జగ్గా జాసూస్

జగ్గా జాసూస్

సినిమా వివరాల్లోకి వెళితే ఇదో మ్యూజికల్ అడ్వంచర్ రొమాంటిక్ ఫిల్మ్. హీరో రణబీర్ కపూర్, దర్శకుడు అనురాగ్ బసు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యారు. యూటీవీ మోషన్ పిక్చర్స్ అధినేత సిద్ధార్థరాయ్ కపూర్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక యంగ్ డిటెక్టివ్ మిస్సయిన తన తండ్రి వెతుక్కుంటూ వెళ్లి ఎలాంటి సాహసాలు చేసాడు అనే కాన్సెప్టుతో ఈ సినిమా సాగుతుంది.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

కత్రినా కైఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ జంటగా నటించిన ‘జగ్గా జాసూస్‌' జులై 14న విడుదల కాబోతోంది.

English summary
Watch Ranbir Kapoor Kiss Anurag Basu. It was all happening at Ranbir Kapoor and Katrina Kaif came together to launch the song Galti Se Mistake from their upcoming film Jagga Jasoos and naturally, the media’s lens was trained on every move of the former couple.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu