»   » తాత బాటలోనే నడుస్తున్నా, ఫ్లాప్‌ అయితే రిటర్న్‌ ఇచ్చేస్తా: హీరో ప్రకటన

తాత బాటలోనే నడుస్తున్నా, ఫ్లాప్‌ అయితే రిటర్న్‌ ఇచ్చేస్తా: హీరో ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఒక జూదం లాంటిది చూసే ప్రేక్షకుడి గురించి కాదు కోట్ల కొద్దీ డబ్బులు పెట్టే నిర్మాతలూ బయ్యర్ల విషయం లో. కొన్ని పెద్ద సినిమాలని నమ్మి చేతిలో ఉన్నదంతా పోసేసాక ఆ సినిమా ఏమాత్రం తేడా చేసినా దారుణంగా న‌ష్ట‌పోయి రోడ్డెక్కాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. భారీ క్రేజీ సినిమాల విషయంలో కోట్ల‌లో డీల్స్ ఉంటాయి కాబ‌ట్టి ఇక ఆ పంపిణీదారుడు రోడ్డెక్కాల్సిందే. స‌రిగ్గా అలాంటి స‌న్నివేశంలోనే త‌న సినిమా కొనుక్కున్న బ‌య్య‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు డ‌బ్బు వాప‌స్ ఇస్తాన‌ని మాటిచ్చాడు స‌ల్మాన్ ఖాన్. క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలోని ట్యూబ్‌లైట్‌ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫెయిలై న‌ష్టాల్ని మిగిల్చింది. దాదాపు 55 కోట్ల మేర న‌ష్టాల్ని తాను భ‌రిస్తాన‌ని స‌ల్మాన్ పంపిణీదారుల‌కు మాటిచ్చారు. దీంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది. అయితే ఇప్పుడు ఇంకో హీరో కూడా అదే పరిస్థితిలో బయ్యర్లకు మాటిచ్చాడు యంగ్ హీరో కమ్ నిర్మాత ర‌ణ‌్‌బీర్ కపూర్

యువ డిటెక్టివ్

యువ డిటెక్టివ్

జగ్గా జాసూస్ కథ బాగానే కనిపిస్తోంది. ఓ యువ డిటెక్టివ్ త‌ప్పిపోయిన తన తండ్రిని వెతుక్కుంటూ బ‌య‌లు దేరతాడు, ఆ ప్ర‌యాణం అత‌డి జీవితంలో కొత్త మ‌లుపు తెస్తుంది. ఈ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రం జ‌గ్గా జాసుస్ . ప్రీత‌మ్ చక్ర‌వ‌ర్తి ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నాడు.

హాలీవుడ్ రేంజ్ లో

హాలీవుడ్ రేంజ్ లో

ఇప్ప‌టికే చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది మూవీపై భారీ అంచ‌నాలు పెంచింది. మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంద‌నే అభిప్రాయాన్ని జ‌నాల‌లో క‌లిగించింది. అయితే రణ్ బీర్ గ్రాఫ్ ఈ మధ్య సరిగ్గా లేదు ఈ పరిస్థితుల్లో సినిమా పక్కా హిట్ అయితే తప్ప అతను గట్టెక్క లేడు. ఫ్లాప్ అయితే మాత్రం కోలుకోలేని దెబ్బ పడ్దట్టే అనుకుంటున్నారు.

Ranbir Kapoor says, Jagga Jasoos belongs to Katrina and Him Equally; Watch video | FilmiBeat
సర్‌ప్రైజ్‌ హిట్‌ అవుతుందని

సర్‌ప్రైజ్‌ హిట్‌ అవుతుందని

'జగ్గా జాసూస్‌' తన జాతకం మారుస్తుందని అతను ఆశిస్తున్నాడు. తనతో బర్ఫీ తీసిన దర్శకుడు అనురాగ్‌ బసు చేసిన సినిమా కావడంతో ఇది కూడా అలా సర్‌ప్రైజ్‌ హిట్‌ అవుతుందని రణ్‌భీర్‌ అనుకుంటున్నాడు. చాలా విచిత్రమైన పాత్ర పోషించిన రణ్‌బీర్‌ ఈ చిత్ర విజయంపై ధీమాగా అయితే లేడు. తన పట్ల బయ్యర్లు ఇప్పటికే కోపంగా వున్నారనేది అతనికి తెలుసు. అందుకే ఈసారి కనుక సినిమా ఫ్లాప్‌ అయితే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని అతను చెబుతున్నాడు.

 తాత‌ గారిని అనుస‌రిస్తా

తాత‌ గారిని అనుస‌రిస్తా

నేను ఈ విష‌యంలో తాత‌ రాజ్‌క‌పూర్‌ గారిని అనుస‌రిస్తా. ఆయ‌న న‌టించిన మేరానామ్ జోక‌ర్ పెద్ద ఫెయిల్యూర్‌. తీవ్ర న‌ష్టాలొచ్చాయి. కానీ ఆ న‌ష్టాల్ని `బాబి` సినిమాలో భ‌ర్తీ చేశారు. డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్ల‌కు `బాబి` పెద్ద మొత్తంలో షేర్లు తెచ్చింది.. అని తెలివైన స‌మాధాన‌మే చెప్పాడు ర‌ణ‌బీర్‌.

 యాభై అయిదు కోట్లు రిటర్న్‌

యాభై అయిదు కోట్లు రిటర్న్‌

తన తాతయ్య రాజ్‌ కపూర్‌ కూడా అలాగే నష్టపోయిన నిర్మాతలకి తన పారితోషికంలోనుంచి తిరిగి కట్టేవారని, తాను కూడా ఇకపై నష్టాల్లో భాగం పంచుకోవాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఇటీవల ట్యూబ్‌లైట్‌తో భారీ డిజాస్టర్‌ చవిచూసిన సల్మాన్‌ఖాన్‌ కూడా బయ్యర్లకి ఏకంగా యాభై అయిదు కోట్లు రిటర్న్‌ ఇస్తున్నాడని టాక్‌ వుంది. మరి ఇప్పుడు జగ్గా.. కూడా ఫ్లాప్ అయితే ఎంతమేరకు ఆ నష్టాన్ని భరిస్తాడో చూదాలి.

English summary
"It is a healthy exercise. If someone loses money on something and you have made money out of it, it's good to compensate," said Ranbir Kapoor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu