»   » హాట్ టాపిక్: హీరోల బర్త్‌డే పార్టీ ఫొటోకు లైకుల వర్షం

హాట్ టాపిక్: హీరోల బర్త్‌డే పార్టీ ఫొటోకు లైకుల వర్షం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హీరోకు ఉండే ఫాన్ ఫాలోయింగ్ ఏమిటనేది సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా తెలుస్తూంటుంది. ఆ అభిమానులు తమ హీరోకు చెందిన ఫొటో పెట్టగానే వెంటనే లైక్ లు కొట్టి తమ ఆనందం ప్రకటిస్తూంటారు. ఒక్కొ హీరో ఫొటో పెడితేనే లైకులు కురుస్తూంటాయి. అలాంటిది ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి ఫొటో పెడితే ఇంకేముంది. అందులోనూ యూత్ లో క్రేజ్ ఉన్న హీరోలు అయితే మరీను. అలాంటిదే ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు జరుగుతోంది. ఆ హీరోలు ఎవరూ ...ఏమిటా కథ అంటారా...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బాలీవుడ్‌ యువ హీరోలు రణ్‌బీర్‌కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌లు ఇద్దరూ రీసెంట్ గా కలిసి పార్టీ చేసుకున్నారు. మరో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌కపూర్‌ గత వారం తన 30వ పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నాడు. ఈ పార్టీ వేడుకకు రణ్‌బీర్‌, రణ్‌వీర్‌లు కలిసి హాజరయ్యారు.

Ranbir Kapoor, Ranveer Singh party together

ఈ సందర్భంగా అర్జున్‌ వారితో సెల్ఫీతీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటోకి 43వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఆషికి-2 ఫేం ఆదిత్యారాయ్‌ కపూర్‌తో కలిసి దిగిన సెల్ఫీని కూడా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టాడు అర్జున్‌.
ఇక రణవీర్ సింగ్ పర్శనల్ లవ్ స్టోరి విషయానికి వస్తే...

రణబీర్ కపూర్‌తో ప్రేమ పెటాకులైన తర్వాత....బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకోన్ మరో యంగ్ స్టార్ రణవీర్ సింగుతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు కారణం ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలే. ప్రస్తుతం రణవీర్, దీపికలు ప్రేమలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రియురాలు ఎక్కడ వుంటే అక్కడే తనకు న్యూ ఇయర్ అన్నట్లుగా దీపిక కోసం రణవీర్ మాల్దీవులకు వెళ్లి ఆమెతో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ వెకేషన్లో దీపిక కుటుంబ సభ్యులు ఉండటం, వారితో రణవీర్ సింగ్ కూడా జాయిన్ అవ్వడం బట్టి చూస్తే ఇద్దరి మధ్య రిలేషన్ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Ranbir Kapoor, Ranveer Singh party together

బెంగుళూరులో దీపిక పుట్టినరోజు వేడుకల్లో కూడా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రణవీర్ పాల్గొన్నాడని, ఇద్దరి మధ్య మధ్య ప్రేమ ముదిరి పెళ్లి దిశగా వారి బంధం సాగుతుందని అంటున్నారు. దీపిక వయసు కూడా 30కి దగ్గరవుతుండటంతో పెళ్లి చేసుకుని పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘రామ్ లీలా' చిత్రం ద్వారా దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య హాట్ అండ్ సెక్సీ శృంగార సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆకర్షణ పెంచుకున్నారు.

English summary
Ranbir Kapoor and Ranveer Singh partied together at Arjun Kapoor's birthday bash. The "2 States" actor, who celebrated his 30th birthday here last weekend, took to photo-sharing application Instagram and shared a selfie of him, Ranbir, Ranveer and filmmaker Karan Johar together. The selfie has so far received more than 43,000 likes.
Please Wait while comments are loading...