»   » వావ్..! అచ్చు గుద్దినట్టు అతని లాగే : రణబీర్ లుక్ చూస్తే ఆశ్చర్య పోతారు (లీక్ ఫోటోలు)

వావ్..! అచ్చు గుద్దినట్టు అతని లాగే : రణబీర్ లుక్ చూస్తే ఆశ్చర్య పోతారు (లీక్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో రణ్‌బీర్ కపూర్ అతడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ లుక్ ఎలా వుండనుందా అన్న ఆలోచనతో పాటు అసలు రణ్ బీర్ కపూర్ ఆ పాత్రకి సూటవు తాడా అన్న అనుమానం కూడా చాలామందికే వచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ అనుమానమే అక్కర లేదు ఎందుకంటే.....

ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు

ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు

సంజయ్ దత్ బయో పిక్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు కొంత లో కొంత సరిపోయేలానే ఉన్నాడు లే అని సరిపెట్టుకున్నారు. కానీ ఆ గెటప్ సంజయ్ యంగ్ ఏజ్‌ల నాటిది జులపాలతో ఖల్నాయక్ కాలం నాటి సంజయ్ దత్ లాగా కనిపించిన రణ్ బీర్ పర్వలేదు అనిపించేలా కనిపించాడు. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ఫొటోలు చూస్తూంటే మాత్రం అసలు ఇంత మేక్ ఓవర్ సాధ్యమా? అనిపించేలా ఉన్నాయి.

తీర్చి దిద్దిన విధానం అబ్బుర పరుస్తుంది

తీర్చి దిద్దిన విధానం అబ్బుర పరుస్తుంది

సంజయ్‌ దత్‌ పోలికలకి దగ్గరగా అతడిని తీర్చి దిద్దిన విధానం అబ్బుర పరుస్తుంది. రణ్‌బీర్‌ గెటప్‌ వరకు సూపర్‌హిట్‌ అయినా కానీ సంజయ్‌ కథని కమర్షియల్‌ సినిమాగా ఎలా మలిచారనేదే ఇక తేలాల్సి వుంది. ఎలాంటి కథనైనా వినోదాత్మకంగా మలిచే నేర్పరి రాజ్‌కుమార్‌ హిరాని మరోసారి తన కనికట్టు చేసాడో లేదో చూడాలి.

 కష్టపడుతున్నాడు

కష్టపడుతున్నాడు

ఆ విషయం పక్కన పెడితే రణ్‌బీర్‌ పడ్డ శ్రమ అతని గెటప్ లో అణువణువునా కనిపిస్తోంది. ముమ్మూర్తులా సంజయ్ కి డూప్లికేట్ లా తయారయ్యాడు . అంతా అనుకున్నట్టు ఏదో చేసేద్దాం అని కాకుండా ఆ సినిమాని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు. అందుకు తగ్గట్టుగా కష్టపడుతున్నాడు.

దియా మీర్జా

దియా మీర్జా

ఇదే విషయమై అతని సహనటి దియా మీర్జా కూడా చెప్పింది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌ సంజరు వేషధారణలో ఎలా ఉంటాడో అన్నదానిపై అంతటా ఆసక్తిగా నెలకొంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ప్రశంసలతో ముంచెత్తుతున్నారు

ప్రశంసలతో ముంచెత్తుతున్నారు

ఈ ఫొటోలు రణ్‌బీర్‌ అచ్చంగా సంజరు దత్‌లా ఉండడంతో నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ ఫొటోలు బయటకు రావడంపై కథానాయిక దియా మీర్జా మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ లుక్‌ అసలు ఇప్పుడు బయటకు రాకూడదని అనుకున్నామని,

మా వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలి

మా వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలి

చాలా జాగ్రత్తలు తీసుకున్నా మీడియా వారు విడుదల చేసేశారు అని ఆవేదన చెందుతుంది ఈ భామ. ''ఈ ఫొటోపై వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉందని కానీ మీడియా మా వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలి. మా యూనిట్‌ ఈ లుక్‌ను విడుదల చేయలేదు'' అని కాస్త చిర్రు బుర్రులాడింది.

టైటిల్ ఖరారు కాలేదు

టైటిల్ ఖరారు కాలేదు

సంజయ్ దత్ జీవితం పూర్తి స్థాయి వివాదాల మయం. ఒక రకంగా బాలీవుడ్ లో చీకటి కోణాలు సంజయ్ తోనే బయట పడటం మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు. పలు కేసుల్లో ఇరుక్కుని ఏళ్ల తరబడి జైలు జీవితం కూడా అనుభవించాడు సంజయ్. ఇక పలువురు హీరోయిన్లతో సంజయ్ దత్ ఎఫైర్ల గురించి అయితే ఏకంగా ఓ పుస్తకమే రాయొచ్చు. అలాంటి సంజయ్ దత్ జీవితంలో జరిగిన సంఘటనలకు కారణాలేంటి? అనే అంశంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు.

English summary
Ranbir Kapoor’s striking similarity to Sanjay Dutt in the pictures from the biopic has even got Sanju Baba talking about the photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu