»   » ఐటీ రైడ్స్‌లో లీకైంది: రూ. 38 కోట్లు తీసుకున్న యంగ్ హీరో!

ఐటీ రైడ్స్‌లో లీకైంది: రూ. 38 కోట్లు తీసుకున్న యంగ్ హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్‌కు ఈ సంవత్సరం అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. ఈ సంవత్సరం ఆయన నటించిన మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన ‘రాయ్'... తర్వాత వచ్చిన ‘బాంబే వెల్వెట్'...ఇటీవల విడుదలైన ‘తమాషా' చిత్రాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు.

తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తమాషా చిత్రానికి రణబీర్ కపూర్ రూ. 38 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. క్వాన్ అనే ఏజెన్సీ తరుపున రణబీర్ కపూర్ తమాషా చిత్రంలో హీరోగా బుక్ అయ్యాడు. ఇటీవల ఆ సంస్థపై ఐటీ రైట్స్ జరుగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Ranbir Kapoor Was Paid A Mindblowing 38 Crores For Tamasha?

ఇటీవల విడుదలైన తమాషా చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న విషయం సాధించలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా నిర్మాతలకు నష్టాలే మిగిల్చింది. వరుస ప్లాపులతో ఉన్న రణబీర్ కపూర్ కు ఇంత అమౌంట్ చెల్లించడం చూసి అంతా షాకవుతున్నారు. రణబీర్ కపూర్ ఇంతకు ముందు నటించి ‘బాంబే వెల్వెట్' చిత్రానికి రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

బాంబే వెల్వెట్ బాక్సాఫీసు వద్ద తీవ్ర నష్టాలనే మిగిల్చింది. ఆ విషయం తెలిసి కూడా ‘తమాషా' చిత్రానికి రూ. 38 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వడం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన ‘తమాషా' చిత్రాన్ని రూ. 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. తొలి 10 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 61.23 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దేశీయంగా రూ. 53.46 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ లో రూ. 7.77 కోట్లు రాబట్టింది.

English summary
Ranbir Kapoor, had a terrible year through his movies, and witnessed back-to-back flops at the box office, but it looks like the actor, has not reduced his price tag despite coming out as average, in his previous movies. The Tamasha star, Ranbir Kapoor, is managed by a company named Kwan. The agency, was recently raided by the IT department and revealed that Ranbir, was paid a mindboggling amount of 38 Crores to act in the movie.
Please Wait while comments are loading...