»   » భోపాల్ జైలుకు రణ్‌బీర్ కపూర్.. ఏం జరిగింది..

భోపాల్ జైలుకు రణ్‌బీర్ కపూర్.. ఏం జరిగింది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కోసం బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ చాలా కష్టపడుతున్నాడు. పాత్ర కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. పాత్ర సహజసిద్ధంగా ఉండాలనే అభిప్రాయం మేరకు రణ్‌బీర్ భోపాల్ జైలుకు వెళ్లనున్నారు. సంజయ్ దత్ బయోపిక్‌కు ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్వకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

13 కేజీల బరువు పెరిగిన రణ్‌బీర్ కపూర్

13 కేజీల బరువు పెరిగిన రణ్‌బీర్ కపూర్

సంజయ్ దత్ బయోపిక్ కోసం రణ్‌బీర్ కపూర్ ఇప్పటికే 13 కేజీల బరువు పెరిగాడు. సంజయ్ దత్‌లా కనిపించడానికి తన శరీరాన్ని పూర్తిగా మార్చుకొంటున్నారు. తాజాగా జైలు జీవితాన్ని రుచి చూడటానికి భోపాల్ జైలుకు వెళ్లనున్నారు.

షూటింగ్ కోసం భోపాల్‌కు చేరుకొన్న రణ్ బీర్

షూటింగ్ కోసం భోపాల్‌కు చేరుకొన్న రణ్ బీర్

బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం ఇప్పటికే రణ్‌బీర్ కపూర్ భోపాల్ చేరుకొన్నట్టు సమాచారం. ముంబై పేలుళ్ల కేసు, అక్రమ ఆయుధాల కేసులో సంజయ్ దత్ పుణేలోని ఎర్రవాడ జైలులో జైలుశిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే.

12వ తేదీ వరకు భోపాల్‌లోనే..

12వ తేదీ వరకు భోపాల్‌లోనే..

జైలు సన్నివేశాల చిత్రీకరణ కోసం దర్శకుడు హిరాణీ, అనుష్క, సంజయ్‌దత్, పరేశ్ రావల్ మార్చి 12వ తేదీ వరకు భోపాల్‌లో ఉండనున్నారు.

నర్గీస్‌గా మనీషా కోయిరాలా, సునీల్‌గా పరేశ్ రావల్

నర్గీస్‌గా మనీషా కోయిరాలా, సునీల్‌గా పరేశ్ రావల్

ఈ చిత్రంలో సంజయ్ తండ్రి సునీల్ దత్ పాత్రను పరేశ్ రావల్, మున్నాభాయ్ ప్రేయసి పాత్రను సోనమ్ కపూర్, తల్లి పాత్రను మనీషా కోయిరాలా, జర్నలిస్టు రోల్‌ను అనుష్క శర్మ పోషిస్తున్నారు. జనవరిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది

English summary
Bollywood actor Ranbir Kapoor is working real hard for his role in Rajkumar Hirani’s upcoming biopic on Sanjay Dutt. Media reports that Ranbir has reached Bhopal and plans to stay in the city’s jail for a week for a first-hand experience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu