»   » రణబీర్, కత్రినా కైఫ్ వివాహం వచ్చే ఏడాది

రణబీర్, కత్రినా కైఫ్ వివాహం వచ్చే ఏడాది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ తార కత్రినా కైఫ్ నటుడు రణబీర్ కపూర్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి వివాహం జరగవచ్చునని అంటున్నారు. అయితే, ఆ వార్తలను కత్రినా కైఫ్ కొట్టేస్తూ ఇంకా కొంత సమయం పెళ్లి కోసం ఆగవచ్చునని బుకాయిస్తోంది. అయితే, పెళ్లికి ఈ బాలీవుడ్ జంట తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ ఇప్పటికే తన తల్లిదండ్రులు, నాయనమ్మ కృష్ణరాజ్ కపూర్ అనుమతి తీసుకున్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

కత్రిన తమ కోడలు అవుతుండడం పట్ల రణబీర్ తల్లిదండ్రులు నీతూ సింగ్, రిషీ కపూర్ ఆనందంగా ఉన్నారట. తమ కుమారుడిది మంచి చాయిస్ అని పొగిడేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. కత్రినాను రణబీర్ కపూర్ తన నాయనమ్మ కృష్ణ రాజ్ కపూర్ వద్దకు వెంట పెట్టుకుని వెళ్లి విషయం చెప్పాడట. పాపం, కత్రినా కైఫ్ మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్‌ ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుందా, ఏమో.

English summary
Bollywood starlet Katrina Kaif is all set to marry Ranbir Kapoor and the marriage will take place, in somewhere around early next year (2012).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu