»   » బాహుబలిని తలదన్నేలా మహాభారతం సినిమా.. బడ్జెట్ 1000 కోట్లు.. 100 భాషల్లో..

బాహుబలిని తలదన్నేలా మహాభారతం సినిమా.. బడ్జెట్ 1000 కోట్లు.. 100 భాషల్లో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సినీ పరిశ్రమకు మణిహారంగా నిలిచింది బాహుబలి సినిమా. బాహుబలి చిత్రాన్ని తలదన్నే విధంగా దక్షిణాదిలో రాండమూజమ్ అనే మరో సినిమా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కడానికి సిద్ధమవుతున్నది. ఈ చిత్రం బడ్జెట్ అక్షరాల రూ.1000 కోట్లు. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మొట్టమొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాను మలయాళ చిత్ర దర్శకుడు శ్రీకుమార్ మీనన్ రూపొందిస్తున్నారు. యూఏఈకి చెందిన ఎన్నారై పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు.

వచ్చే ఏడాది..

వచ్చే ఏడాది..

రాండామూజమ్ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో సెట్‌పైకి వెళ్లనున్నది. ఈ చిత్రం రెండు భాగాలుగా వెండితెరపైకి రానున్నది. తొలిభాగానని 2020లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిను మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఆంగ్ల భాషల్లో తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత భారతీయ భాషల్లోకి, విదేశీ భాషల్లోకి డబ్బింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

మహాభారతం కథ వెండితెరపైకి..

మహాభారతం కథ వెండితెరపైకి..

మహాభారతం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రాసిన రాండామూజమ్ నవల ఆధారం. మహాభారతంలో భీముని పాత్ర కోణంలోనూ, పాండవుల కథ నేపథ్యంగా సాగుతుందని చిత్ర నిర్వాహకులు వెల్లడించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ నిపుణులు, ఇతర దేశాల టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్లోబల్ చిత్రంగా రూపొందిస్తున్నారు.

మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి

మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి

ప్రధాని మోదీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నామని యూఏఈ ఎక్స్సేంజ్ చైర్మన్, ఎన్‌ఎంసీ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు షెట్టి తెలిపారు.ఈ చిత్రం ప్రపంచ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

100 భాషల్లోకి..

100 భాషల్లోకి..

దాదాపు 100కు పైగా భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు. దాదాపు మూడు వందల కోట్ల మంది చూసే లక్ష్యంగా ఈ సినిమాను రూపొందిస్తున్నామని శెట్టి చెప్పారు. ఈ చిత్రానికి వాసుదేవ నాయర్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. వాసుదేవ నాయర్‌ స్క్రీన్ ప్లే అందించిన పలు చిత్రాలు గతంలో జాతీయ స్థాయి అవార్డులు అందుకొన్నాయి.

మోహన్ లాల్ కథానాయకుడిగా..

మోహన్ లాల్ కథానాయకుడిగా..

గతేడాది ఈ చిత్రంలో నటించాలని ఉందన్న ఆశాభావాన్ని మాలీవుడ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 2014లోనే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, విక్రమ్, నాగార్జున తదితరులతో తీయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో తాను నటించడం లేదని అమితాబ్ బచ్చన్ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు.

మహాభారతంపైన రాజమౌళి ఆసక్తి..

మహాభారతంపైన రాజమౌళి ఆసక్తి..

మరో ఆసక్తికరమైన విషయమేమింటంటే బాహుబలితో దక్షిణాది సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌తో చర్చించినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

English summary
The epic mythology Mahabharata will now be made as a feature film with a whopping budget of Rs 1000 crore. A UAE-based Indian businessman BR Shetty is investing Rs 1,000 crore to produce India's biggest-ever motion picture, The Mahabharata, which will be helmed by ad-filmmaker Shrikumar Menon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu