»   » రంగం-2 సినిమా విశేషాలు...

రంగం-2 సినిమా విశేషాలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌గుడ్‌ మూవీస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి తనయుడు జీవా నటించిన 'రంగం' ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ కె.వి.ఆనంద్‌ దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రంలో జీవా సరసన నిన్నటి తరం బ్యూటీక్వీన్‌ రాధ పెద్ద కుమార్తె కార్తీక నటించింది. మరో ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ రవి.కె.చంద్రన్‌ దర్శకుడిగా పరిచయమవుతూ తమిళంలో రూపొందించిన 'యాన్‌' చిత్రాన్ని తెలుగులో 'రంగం-2' పేరుతో అనువదిస్తున్నారు. జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ బాలాజీ) ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

English summary
'Rangam-2', directed by Ravi K Chandran, stars Jiiva in the lead role. A dubbed version of the 2014 Tamil action film 'Yaan', the film is currently in post-production stage. Thulasi Nair, younger daughter of yesteryear actress Radha and sister of Karthika, is the female lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu