»   » ఇక దేశవ్యాప్తంగా రంగస్థలం.. బిగ్ ప్లానింగ్ ఇదే!

ఇక దేశవ్యాప్తంగా రంగస్థలం.. బిగ్ ప్లానింగ్ ఇదే!

Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ బాక్స్ ఆఫీస్ సత్తాని మరో మారు నిరూపించిన చిత్రం రంగస్థలం. చిట్టి బాబుగా రాంచరణ్ చెలరేగిపోయాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. రాంచరణ్ నటన కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. రంగస్థలం సాధించిన విజయంతో రాంచరణ్ ఫుల్ ఖుషికిగా ఉన్నాడు. నేడు రంగస్థలం చిత్ర విజయోత్సవ వేడుక కూడా జరగబోతోంది. అద్భుతమైన కథ కావడంతో ఈ చిత్రాన్ని దేశవ్యాప్తం చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Upasana Went To Tirumala By Walk...To day Rangasthalam Success Event At Hyderabad
ఫుల్ జోష్ లో రాంచరణ్

ఫుల్ జోష్ లో రాంచరణ్

రంగస్థలం అందించిన విజయంతో రాంచరణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలిచి టాలీవుడ్ లో బాహుబలి తరువాతి స్థానాన్ని ఆక్రమించింది.

ప్రతి పాత్రకు న్యాయం

ప్రతి పాత్రకు న్యాయం

ఈ చిత్రంతో సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసింది. ప్రతి పాత్రకు న్యాయం జరిగేలా ఆయన రాసుకున్న కథ అద్భుతం అని ప్రశంసలు దక్కుతున్నాయి.1980 నాటి పరిస్థితులతో విలేజ్ పొలిటికల్ డ్రామాని సుకుమార్ ఆసక్తికరంగా వెండితెరపై చూపించారు.

పరభాషల్లో రాణించే సత్తా ఉన్న కథ

పరభాషల్లో రాణించే సత్తా ఉన్న కథ

రంగస్థలం చిత్ర కథ పరభాషల్లో కూడా రాణించే సత్తా ఉందని సినీ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. ఆద్యతం ఆసక్తిగా సాగె రంగస్థలం లాంటి కథలకు ఏభాషలో అయినా మార్కెట్ ఉంటుందని అంటున్నారు.

దేశవ్యాప్తంగా రంగస్థలం

దేశవ్యాప్తంగా రంగస్థలం

రంగస్థలం చిత్రాన్ని పలు భాషల్లోకి అనువదించేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం గురించి రాంచరణ్ మాట్లాడాడు. రంగస్థలం చిత్రం అంచనాలని మించే విధంగా ఉంది. అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లోకి అనువదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాంచరణ్ తెలిపాడు.

ముందుగా ఆభాషల్లోకి

ముందుగా ఆభాషల్లోకి

రంగస్థలం చిత్రాన్ని ముందుగా తమిళ్, మలయాళం, హిందీ, భోజ్ పూరి వంటి భాషల్లోకి అనువదించనున్నట్లు రాంచరణ్ తెలిపాడు.

English summary
Rangasthalam to be dubbed in other languages. Rangasthalam is career best hit for Ram Charan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X