»   » ‘రంగస్థలం’ మూవీ సెన్సార్ రిపోర్ట్

‘రంగస్థలం’ మూవీ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందుతున్న భారీ చిత్రం రంగ‌స్థ‌లం. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం) నిర్మాత‌లు ఈ ప్రెస్టీజియ‌స్ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. తాజాగా రంగస్థలం చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది.

నిర్మాత‌లు మాట్లాడుతూ - శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న మోస్ట్ ఎగ్జ‌యిటింగ్ ప్రాజెక్ట్ రంగ‌స్థ‌లం. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌ చరణ్ చిట్టిబాబు పాత్ర‌లో మాస్ యాక్టింగ్‌, స‌మంత గ్లామర్ ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. విల‌క్ష‌ణ‌మైన క‌థ‌లు, క్యారెక్ట‌రైజేష‌న్స్‌ను తెరపై సిద్ధ‌హ‌స్తుడైన ద‌ర్శ‌కుడు సుకుమార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమాలే ఆయ‌నేంటో చెబుతాయి. మ‌రోసారి త‌న‌దైన స్ట‌యిల్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను సుకుమార్‌గారు ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించారు. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత ఇంతకు ముందెన్న‌డూ చేయ‌ని విభిన్న‌మైన‌ పాత్ర‌లు చేస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దేవిశ్రీప్ర‌సాద్ అద్భుత‌మైన మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌పీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి.

Rangasthalam Censor Completed

మా చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ వారు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. మార్చి 30న వ‌రల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం మా బ్యాన‌ర్ వాల్యూను పెంచడ‌మే కాకుండా మా సంస్థ‌కు హ్యాట్రిక్ హిట్‌ను అందించే చిత్ర‌మ‌వుతుంది అన్నారు.

రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత‌, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆది పినిశెట్టి, అన‌సూయ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: ర‌త్న‌వేలు, ఎడిటింగ్‌: న‌వీన్ నూలి, సాహిత్యం: చ‌ంద్ర‌బోస్‌, ఫైట్స్‌: రామ్‌ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం), ద‌ర్శ‌క‌త్వం: సుకుమార్‌.

    English summary
    Ram Charan, Samantha & Sukumar's 'Rangasthalam' completed censor formalities with U/A certificate, grand release on March 30, 2018.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X