»   » జోరు మీద ఉన్న చిట్టిబాబుని మోహన్ రంగ ఆపగలడా!

జోరు మీద ఉన్న చిట్టిబాబుని మోహన్ రంగ ఆపగలడా!

Subscribe to Filmibeat Telugu

రంగస్థలం చిత్రంతో రాంచరణ్ కెరీర్ బెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రం యునానిమస్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కలెక్షన్లు కళ్ళు చెదిరేలా వస్తున్నాయి. రంగస్థలం చిత్రం టాలీవుడ్ టాప్ గ్రాసర్ మూవీస్ లో ఒకటిగా ఉండబోతోంది. రంగస్థలం చిత్రం విడుదలైన 6 గడచినా అదే జోరుతో దూసుకుపోతోంది. ఈ తరుణంలో నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగ చిత్రం విడుదలయింది. దీనితో రంగస్థలం, ఛల్ మోహన్ రంగ చిత్రాల మధ్య పోటీ ఎలా ఉండబోతోందని సినీ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

ఇప్పటికిప్పుడు ఎన్ని చిత్రాలు విడుదలైనా రంగస్థలం చిత్రానికి వచ్చిన నష్టం ఏమి లేదు. ఎందుకంటే ఈ చిత్రం మేజర్ పార్ట్ వసూళ్ళని ఆల్రెడీ కొల్లగొట్టేసింది. రాంచరణ్ అద్భుత నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో రంగస్థలం చిత్ర వేడి బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికి కొనసాగుతోంది.


Rangasthalam and Chal Mohan Ranga boxoffice war

ఛల్ మోహన్ రంగ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. కామెడీతో ఆకట్టుకుంటున్నా కథ విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రంగస్థలం చిత్రం 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 76 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికి కలెక్షన్లు స్ట్రాంగ్ గా కొనసాగుతున్నాయి. ఛల్ మోహన్ రంగ చిత్రం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఫ్యాక్టర్ తో ఏ మేరకు రాణిస్తుందో చూడాల్సి ఉంది. చిట్టి బాబు దూకుడుని మోహన్ రంగ అడ్డుకుంటాడా లేదా అనే విషయం మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది.

English summary
Rangasthalam and Chal Mohan Ranga boxoffice war. Pawan Kalyan and Trivikram factor will help Nithin
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X