twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రంగస్థలం’ షూటింగ్ జరిగిన చోటే భారీ విషాదం, నిర్మాతల సంతాపం!

    By Bojja Kumar
    |

    ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నదిపై జరిగిన బోటు ప్రమాదంలో దాదాపు 36 మంది గల్లంతయిన సంగతి తెలిసిందే. గల్లంతయిన వారంతా మరణించినట్లు భావిస్తున్నారు. రాజమహేంద్రవరం నుండి దేవీపట్నం వెళుతున్న బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ విషాదం చోటు చేసుకుంది.

    ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే 'రంగస్థలం' షూటింగ్ జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మైత్రిమూవీ మేకర్స్ స్పందించారు. ఈ ప్రాంతంలోనే మేము రంగస్థలం సినిమా చిత్రీకరించాము. ప్రమాద ఘటన తమను ఎంతో బాధిచిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

    Rangasthalam Makers about A.P. boat mishap

    లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నేవీ అధికారులు, గజ ఈతగాళ్లు గల్లంతైన వారి కోసం నదిని జల్లెడపడుతున్నారు. భారీ క్రేన్ల సహాయంతో నదిలో సుమారు 60 అడుగుల లోతులో మునిగిపోయిన లాంచీని వెలికి తీశారు. కొన్ని మృతదేహాలు లాంచీలోనే ఉన్నట్లు గుర్తించారు.

    ఈ ప్రమాదంపై 'రంగస్థలం' నటులు రామ్ చరణ్, సమంత, అనసూయ తదితరులు విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతున్నాయని, ఈ ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని చిత్ర యూనిట్ విచారం వ్యక్తం చేశారు.

    English summary
    "Extremely saddened with the news of the mishap. We shot for #Rangasthalam in these surrounding areas. Our deepest condolences to the families of the deceased." Mythri Movie Makers said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X