»   » రంగస్థలం ఫస్ట్ రివ్యూ, రేటింగ్ అదిరిపోయిందిగా..యూఏఈ నుంచి తొలి స్పందన!

రంగస్థలం ఫస్ట్ రివ్యూ, రేటింగ్ అదిరిపోయిందిగా..యూఏఈ నుంచి తొలి స్పందన!

Subscribe to Filmibeat Telugu
Rangasthalam Movie Get Sensored In UAE

ఈ ఏడాది వేసవిలో సందడి చేయబోతున్న క్రేజీ చిత్రాలలో రంగస్థలం చిత్రం కూడా ఒకటి. సుకుమార్ శైలిలో రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలినుంచీ అందరి దృష్టిని ఆకర్షించింది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ కథానాయకుడిగా ఈ చిత్రంలో ప్రయోగమే చేయబోతున్నాడు.

చరణ్ ఈ తరహా పాత్రలో గతంలో నటించలేదు. రంగస్థలం లాంటి చిత్రం కూడా తెలుగులో ఈ మధ్య కాలంలో రాలేదు. ఈ శుక్రవారం రంగస్థలం చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రంగస్థలం చిత్రానికి సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. యూఏఈ నుంచి రంగస్థలం చిత్రానికి తొలి రెస్పాన్స్ అదిరిపోయింది.

 మెగా పవర్ స్టార్ మెరుపులు

మెగా పవర్ స్టార్ మెరుపులు

ఇప్పటి వరకు మాస్ యాక్షన్ తో మెరుపులు మెరిపించిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ రంగస్థలం చిత్రంలో కొత్తగా కనిపించబోతున్నాడు. రాంచరణ్ చిట్టిబాబుగా మారి సందడి చేయబోతున్నాడు. 1985 నాటి పరిస్థితులకు అనుగుణంగా చరణ్ ఏవిధంగా నటిస్తాడో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.


అందరిలో ఉత్కంఠ

అందరిలో ఉత్కంఠ

సుకుమార్ రంగస్థలం చిత్రంలో రాంచరణ్ ని వినికిడి లోపం ఉన్న యువకుడిగా చూపించబోతున్నాడు. చరణ్ వంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోని వినికిడి లోపంతో చూపించడం అంటే సాహసమే. కానీ అదే అంశం అభిమానులకు బాగా చేరువైంది. టీజర్ ట్రైలర్ లో రాంచరణ్ నటన అదుర్స్ అనిపించే విధంగా ఉంది. ఇక వెండి తెరపై ఎలా ఉండబోతోందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొనివుంది.


రేపే(శుక్రవారం) విడుదల

రేపే(శుక్రవారం) విడుదల

భారీ ప్రచార కార్యక్రమాలు, అంతకు మించే అంచనాలతో రంగస్థలం చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు ఏడాది సమయం అభిమానుల నిరీక్షణకు రేపటితో తెర పడనుంది.


రాజకీయ నేపథ్యంలో

రాజకీయ నేపథ్యంలో

పల్లెటూరి రాజకీయ నేపథ్యంలో బలమైన కథతో ఈ చిత్రం సాగనుంది. టైలర్ లో చూపిన విధంగా ఈ చిత్రంలో ఆకట్టుకునే రాజకీయ అంశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. హీరో ఆది పినిశెట్టి రామ్ చరణ్ సోదరుడిగా నటించాడు.


 రామలక్ష్మిగా సమంత

రామలక్ష్మిగా సమంత

ఎలాంటి పాత్రకైనా తనదైన పెర్ఫామెన్స్ తో న్యాయం చేయగలిగే నటి సమంత. సమంత ఈ చిత్రంలో పేదింటి పల్లెటూరి అమ్మాయిగా రామలక్ష్మిగా కనిపించబోతోంది.


తొలి రెస్పాన్స్ వచ్చేసింది

తొలి రెస్పాన్స్ వచ్చేసింది

రంగస్థలం చిత్రానికి తొలి రెస్పాన్స్ యూఏఈ నుంచి వచ్చేసింది. తాజాగా రంగస్థలం చిత్రం యూఏఈలో సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. ప్రముఖ క్రిటిక్ మరియు యూఏఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు రంగస్థలం చిత్రంపై తన స్పందనని సోషల్ మీడియా వేదికగా తెలియజేసాడు.


కాసులు కురిపించే చిత్రం

కాసులు కురిపించే చిత్రం

రంగస్థలం చిత్రం కాసులు కురిపించే పైసా వసూల్ కలర్షియల్ చిత్రం అని ఉమర్ సందు కితాబిచ్చాడు. రాంచరణ్, జగపతి బాబు మరియు సమంత అద్భుతమైన పెర్ఫామెన్స్ తో అదరగొట్టినట్లు ఉమర్ తెలిపాడు.


అదిరిపోయే రేటింగ్

అదిరిపోయే రేటింగ్

ఉమర్ సందు రంగస్థలం చిత్రానికి తాను ఇచ్చే రేటింగ్ 3.5 అని పేర్కొన్నాడు. అద్భుతమైన కథ, సుకుమార్ దర్శకత్వం, ఆకట్టుకునే దేవిశ్రీ సంగీతం చిత్రానికి కలసి వచ్చే అంశాలుగా ఉమర్ పేర్కొనడం విశేషం.


English summary
Rangasthalam movie first review from UAE. Umair Sandhu told amzing things about Rangasthalam movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X