»   » రంగస్థలం: కన్నీళ్లు పెట్టిస్తున్న ‘ఓరయ్యో’ సాంగ్ (లిరికల్ వీడియో)

రంగస్థలం: కన్నీళ్లు పెట్టిస్తున్న ‘ఓరయ్యో’ సాంగ్ (లిరికల్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల పరంగా దుమ్ము రేపుతోంది. రామ్ చరణ్, సుకుమార్ కెరీర్లోనే ఈ చిత్రం ది బెస్ట్ చిత్రం‌గా పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. కథ పరంగా, కాస్టింగ్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా, మ్యూజిక్ పరంగా ఇలా అన్ని విషయాలు ఈ సినిమాకు పర్ఫెక్టుగా సూటవ్వడంతో 'రంగస్థలం' ఓ రేంజికి వెళ్లిపోయింది.

సినిమా విడుదల ముందే 'రంగస్థలం' ఆడియో సూపర్ హిట్ అయింది. ఆడియో ఆల్బంలో 5 పాటలు మాత్రమే విడుదల చేశారు. సినిమాలో ఆది పినిశెట్టి పోషించిన కుమార్ బాబు పాత్ర చనిపోయినపుడు వచ్చే ట్రాజెడీ సాంగ్ విడుదల చేయలేదు. తాజాగా ఈ పాటను యూట్యూబ్ ద్వారా లిరికల్ వీడియోగా విడుదల చేశారు.'ఓరయ్యో... నా అయ్యా' అంటూ సాగే ఈ పాట థియేటర్లో ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ పాటను చంద్రబోస్ స్వయంగా రాయడంతో పాటు పాడారు. ఓరయ్యో లిరిక్స్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.


ఈ చిత్రంలో రామ్ చరణ్ తర్వాత కీలకమైన పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. నిన్న జరిగిన థాంక్స్ మీట్లో సుకుమార్ ఆదిపై ప్రశంసల వర్షం కురిపించారు. సుకుమార్ మాట్లాడుతూ 'ఆది అమేజింగ్ పెర్ఫార్మర్. చెన్నైలో పుట్టి పెరిగినా కూడా డైలాగ్ డిక్షన్, మాడ్యులేషన్, చెప్పే విధానం చాలా అద్భుతం.


ఈ సినిమాలో ఏ పాత్రను మీరు ఐడెంటిఫై చేసుకుంటారు అంటే కుమార్ బాబు అని చెప్పాను. చిట్టిబాబు క్యారెక్టర్ తర్వాత కుమార్ బాబు పాత్ర చాలా ఇష్టం. శవంలా నటించిన సీన్లో ఒక్క షాట్‌ కూడా సీజీకి ఇవ్వలేదు. ఎక్కడా ఊపిరి పీల్చిన సందర్భం మాకు కనిపించలేదు. ఆది అసలు అలా ఎలా నటించాడో తెలియదు' అని అన్నారు.

English summary
Rangasthalam movie 6th song ‘Orayyo Naa Ayya' release, which is sung by Chandrabose.The movie starring Ram Charan, Samantha, Jagapathi Babu, Aadhi Pinisetty. Music by Devi Sri Prasad, Lyrics by Chandrabose.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X