»   » రంగస్థలం ప్రీరిలీజ్ రివ్యూ.. రాంచరణ్, సమంత యాక్టింగ్ అదుర్స్.. అద్భుతంగా ఎన్నో విశేషాలు..

రంగస్థలం ప్రీరిలీజ్ రివ్యూ.. రాంచరణ్, సమంత యాక్టింగ్ అదుర్స్.. అద్భుతంగా ఎన్నో విశేషాలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rangasthalam Review : Five Reasons Why You Should Watch Rangasthalam

బాహుబలి తర్వాత ఇటీవల కాలంలో ఓ సినిమాకు ఎన్నడు లేనంత హైప్, క్రేజ్ వచ్చిందంటే అది రంగస్థలం చిత్రానికే. మెగాపవర్ స్టార్ రాంచరణ్‌, సమంత అక్కినేని నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నెలకొన్నాయి. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమైంది.

80వ దశకం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన రంగస్థలం చిత్రం విడుదలకు ముందే విభిన్నమైన చిత్రంగా పేరుతెచ్చుకొన్నది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్, గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా వేసిన సెట్టింగులు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రంగస్థలం సినిమాకు భారీ అంచనాలు పెంచే విధంగా చేసిన ప్రధాన అంశాలు ఇవే.

ప్రపంచవ్యాప్తంగా 1700 థియేటర్లలో

ప్రపంచవ్యాప్తంగా 1700 థియేటర్లలో

రంగస్థలం చిత్రం అమెరికాలో మార్చి 29న, మిగితా అన్ని ప్రాంతాల్లో మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 1700 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. రాంచరణ్ కెరీర్‌లోనే ఇది ఓ రికార్డు. ఇప్పటికే ఈ చిత్రం రూ.100 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం సినిమా స్టామినాకు అద్దం పట్టింది.

రాంచరణ్ చిట్టిబాబుగా

రాంచరణ్ చిట్టిబాబుగా

రంగస్థలం చిత్రంలో రాంచరణ్ పోషించిన చిట్టిబాబు పాత్ర విడుదలకు ముందే విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. రాంచరణ్ మేకోవర్, చెప్పిన డైలాగ్స్‌ ఫ్యాన్స్‌కు కేకపుట్టిస్తున్నాయి. నీటిపంపులు బిగించడం, అన్యాయాన్ని జరిగితే సహించిన ఓ గ్రామ యువకుడి పాత్ర టీజర్లు, ట్రైలర్లలో ఆకట్టుకొంటున్నది. ఓ దుష్ఠుడి చెరనుంచి గ్రామాన్ని విడిపించే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలోని నటనకు జాతీయ అవార్డు వస్తుందనే ఆశాభావాన్ని నటుడు నరేష్ వ్యక్తం చేయడం గమనార్హం.

రామలక్ష్మీ‌ పాత్రలో సమంత

రామలక్ష్మీ‌ పాత్రలో సమంత

రంగస్థలం చిత్రంలో రామలక్ష్మీ పాత్రలో సమంత అక్కినేని నటించారు. గ్రామీణ యువతిగా కనిపించిన సమంత పాత్ర చుట్టే రంగస్థలం సినిమా కథ తిరుగుతుందనే ప్రాథమిక సమాచారం. ఈ చిత్రంలోని సమంత ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పటికే యూత్‌ను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఎంత సక్కగున్నావే పాట ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నది.

సుకుమార్ విజన్

సుకుమార్ విజన్

రంగస్థలం సినిమాకు రాంచరణ్ ఒక హీరో అయితే.. మరో హీరో సుకుమార్. ఈ సినిమా కథను సుకుమార్ రూపుదిద్దిన తీరుకు ప్రేక్షకులు, సినీవర్గాలు ఫిదా అయిపోయారు. నాన్నకు ప్రేమతో లాంటి అర్భన్ సినిమాను రూపొందించిన సుకుమార్.. తాజాగా పక్కా గ్రామీణ వాతావరణం, అది కూడా 80 నాటి పరిస్థితులతో ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చి రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్‌ను సొంతం చేసుకొన్నది.

దేవీ శ్రీ ప్రసాద్ క్రేజీ మ్యూజిక్

దేవీ శ్రీ ప్రసాద్ క్రేజీ మ్యూజిక్

రంగస్థలం సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ చిత్రానికి చంద్రబోస్ సింగిల్ కార్డు గీత రచయిత ఘనతను సొంతం చేసుకొన్నాడు. రంగా రంగా రంగస్థలాన, రంగమ్మా మంగమ్మా, ఆగట్టునుంటావా, జిగేల్ రాణి పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి.

కళ్లు చెదిరే సెట్టింగులు

కళ్లు చెదిరే సెట్టింగులు

రంగస్థలం సినిమాకు విలేజ్ సెట్టింగ్ ప్రధాన ఆకర్షణ. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గ్రామం సెట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. మోనికా సహకారం అందించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లాంటి విలాసవంతమైన ప్రాంతంలో దాదాపు 80కు పైగా ఇళ్లు, గుడిసెలు వేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు రామకృష్ణ. ప్రశాంతి స్టైలింగ్ వర్క్ ఈ చిత్రాన్ని మరింత ఆకర్షణగా మార్చింది.

 పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్

పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్

రంగస్థలం సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ పూజాహెగ్డే ఐటెమ్ సాంగ్. జిగేలు రాణి పాటపై పూజా హెగ్డే చేసిన డ్యాన్స్ మంచి క్రేజ్‌ను పెంచింది. అలాగే అనసూయ రంగమ్మత్త పాత్ర ఈ ప్రాజెక్ట్‌కు మరో క్రేజీగా మారింది. అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్. ప్రతీ ఫ్రేమ్‌ను రత్నవేలు అందంగా తీర్చిదిద్దినట్టు సమాచారం.

 చిరంజీవి ప్రశంస

చిరంజీవి ప్రశంస

రంగస్థలం చిత్రంలో ఆది పినిశెట్టి నటన సినిమాకు ప్రాణంగా నిలిచింది అని ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి వెల్లడించారు. క్లైమాక్స్‌లో ఆయన నటన కంటతడి పెట్టించే విధంగా ఉంటుంది అని మెగాస్టార్ చెప్పడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. మిగితా పాత్రల్లో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు తదితరులు నటించారు.

English summary
Rangasthalam starring Ram Charan and Samantha Akkineni is this week’s big release in the south. The film directed by Sukumar has earned a positive buzz ahead of its release and the pre-booking in Telugu speaking states is quite encouraging, according to the trade. It is a film set in the 80s and unfolds in a village.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X